Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాద‌ర్‌'తో మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చేశారా?

By:  Tupaki Desk   |   8 Oct 2022 2:30 PM GMT
గాడ్ ఫాద‌ర్‌తో మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చేశారా?
X
టాలీవుడ్ మేక‌ర్స్‌, స్టార్స్ హాలీడేస్‌, ఫెస్టివ‌ల్ సీజ‌న్స్ ని ప్ర‌త్యేకంగా చూస్తుంటారు. కార‌ణం మిగ‌తా రోజుల‌తో పోలిస్తే ఆ రోజుల్లో వ‌చ్చే క‌లెక్ష‌న్స్ రెండింత‌లు వుంటాయి కాబ‌ట్టి. అందుకే ప్ర‌తీ హీరో హాలీడేస్ తో పాటు ఫెస్టివెల్ సీజ‌న్ ల‌ని ప్ర‌త్యేకంగా చూస్తూ ఆయా సందర్భాల్లో త‌మ సినిమాల‌ని రిలీజ్ చేస్తుంటారు. భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటారు. కానీ ద‌స‌రా ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన సినిమాల‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం చ‌ర్చ‌నీయావంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి న‌టించిన లేటెస్ట్ పొలిటిక‌ల్ యాక్ష‌న్‌ డ్రామా 'గాడ్ ఫాద‌ర్‌'. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'లూసీఫ‌ర్' ఆధారంగా ఈ మూవీని తెలుగులో మోహ‌న్ రాజా రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. భారీ స్థాయిలో ఈ శుక్ర‌వారం ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక పోయింది. దీంతో ట్రేడ్ వ‌ర్గాలు షాక్ కు గుర‌వుతున్నార‌ట‌.

పండ‌గ సీజ‌న్ లో కూడా ఈ స్థాయి వ‌సూళ్లేంటీ మ‌హాప్ర‌భో అని షాక్ అవుతున్నార‌ట‌. గ‌తంలో దాదాపు ప‌దేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వున్న మెగాస్టార్ 'ఖైదీ నంబ‌ర్ 150'తో మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అప్ప‌ట్లో ఈ మూవీ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. తొలి రోజు ఏకంగా రూ. 23 కోట్ల‌కు మించి షేర్‌ని రాబ‌ట్టి చిరు స‌త్తా ఇప్ప‌టికీ త‌గ్గ‌లేద‌ని మ‌రో సారి నిరూపించింది. అయితే 'గాడ్ ఫాద‌ర్‌' మాత్రం ఈ మొత్తంలో కేవ‌లం రూ. 13 కోట్ల షేర్ ని మాత్ర‌మే రాబ‌ట్టి షాకిచ్చింది.

దీనికి కార‌ణం ఏంటా అని ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆరా తీస్తున్నారు. గ‌తంలో ఫ్లాప్ సినిమా అయినా స‌రే పండ‌గ వేళ రిలీజ్ అయితే థియేట‌ర్లు క‌ళ క‌ళ లాడేవి.. జ‌నంతో నిండిపోయివి. దీంతో టాక్ తో సంబంధం లేకుండా ఫ్లాప్ సినిమాలు కూడా భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టేవి. కానీ ఇప్ప‌డు అలా జ‌ర‌గ‌డం లేదు. హిట్ సినిమాకు కూడా వ‌సూళ్లు ఆశించిన స్థాయిలో రావ‌డం లేదు. కార‌ణం పెరిగిన టికెట్ రేట్లేన‌ని మ‌రో సారి తేలింది.

ఆ కార‌ణంగానే స‌గ‌టు ప్రేక్ష‌కుడు థియేట‌ర్ల‌కు రావ‌డానికి సాహ‌సించ‌డం లేద‌ని, ఒక్కో ఫ్యామిలీ థియేట‌ర్ కు రావాలంటే అక్ష‌రాలా రూ. 1500 నుంచి రూ. 2000 వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సిన పరిస్థితి. అదూ అమౌంట్ లో స‌గం ఖ‌ర్చు చేస్తే ఇంటిల్లిపాదీ ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండానే 4కెలో సినిమా చూసేయొచ్చు. ఓటీటీ ల్లో రోజూ ఓ సినిమా చూసుకునే వెలుసుబాటు వుండ‌టం వ‌ల్లే స‌గ‌టు ప్రేక్ష‌కుడు వేలు ఖ‌ర్చు చేసి థియేట‌ర్ల‌కు రావ‌డానికి సాహ‌సించ‌డం లేద‌ని 'గాడ్ ఫాద‌ర్‌'తో మ‌రోసారి రుజువైంది.

మ‌రి ఈ విపత్క‌ర ప‌రిస్థితి నుంచి ఇండ‌స్ట్రీ బ‌య‌ట‌ప‌డాలంటే టికెట్ రేట్లు త‌గ్గించాలి లేదా? ఆడియ‌న్స్ ని ఎగ్జైట్ చేసే క‌థ‌ల‌తో అయినా సినిమా చేయాలి అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.