Begin typing your search above and press return to search.

ఆది పినిశెట్టి 'క్లాప్' టీజర్ రెడీ..!

By:  Tupaki Desk   |   2 Sep 2021 1:30 PM GMT
ఆది పినిశెట్టి క్లాప్ టీజర్ రెడీ..!
X
ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''క్లాప్". 'ది సౌండ్ ఆఫ్ సక్సెస్' అనేది దీనికి ఉపశీర్షిక. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆది సరసన 'మళ్లీ రావా' ఫేమ్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

''క్లాప్" సినిమా టీజర్ ను సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆది స్ప్రింట్‌ ను చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని వదిలారు. ఇందులో పరుగు పందెంలో పాల్గొంటున్న క్రీడాకారుడిగా ఆది ఇంటెన్స్ గా చూస్తున్నాడు. స్ప్రింటర్‌ గా క‌నిపించేందుకు ఆది కఠినమైన శిక్షణ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్విల్ గా ఈ సినిమా రూపొందుతోంది. వీలైనంత త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి కి 'క్లాప్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

''క్లాప్" చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు సమకూరుస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి రాగుల్‌ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ కురూప్ - ప్రకాష్ రాజ్ - నాజర్ - బ్రహ్మాజీ - రాందాసు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ అధినేత ఐ.బి. కార్తికేయ‌న్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌ మరియు శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌పై రూపొందిస్తున్నారు. రామాంజ‌నేయులు జ‌వ్వాజి - ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.