Begin typing your search above and press return to search.

మరో కెమెరామన్ డైరెక్టర్ అయ్యాడు

By:  Tupaki Desk   |   24 April 2017 4:39 PM IST
మరో కెమెరామన్ డైరెక్టర్ అయ్యాడు
X
ఇప్పుడు డైరెక్షన్ చేయాలంటే ముందు నుంచి దర్శకత్వ విభాగంలోనే పని చేయాలనేమీ లేదు. వేరే విభాగాల ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత మెగా ఫోన్ పడుతున్న వాళ్లు చాలామందే ఉంటున్నారు. ప్రస్తుతం చాలామంది ముందు రైటర్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దర్శకులవుతున్నారు. వీరితో పాటు కొరియోగ్రాఫర్లు.. కెమెరామన్లు.. ఎడిటర్లు సైతం మెగా ఫోన్ పడుతున్న వాళ్లే.

తాజాగా టాలీవుడ్లో ఓ టాలెంటెడ్ కెమెరామన్ దర్శకుడిగా మారబోతున్నాడు. అతనే సాయి శ్రీరామ్. పిల్ల జమీందార్.. గీతాంజలి.. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాలతో ఛాయాగ్రాహకుడిగా మంచి పేరు సంపాదించిన సాయి శ్రీరామ్.. త్వరలోనే దర్శకుడిగా మారుతున్నాడు. యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా అతను సినిమా చేయబోతుండటం విశేషం.

ఇటీవలే శౌర్యకు ఓ కథ చెప్పి మెప్పించాడు సాయిశ్రీరామ్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ‘జ్యో అచ్యుతానం’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నాగశౌర్య.. ఈ ఏడాది వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. నారా రోహిత్ కాంబినేషన్లో ‘కథలో రాజకుమారి’లో నటిస్తూనే సొంత బేనర్లో ఓ కొత్త దర్శకుడితో సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇది కాక ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/