Begin typing your search above and press return to search.

అన్‌ లాక్‌ అనుమతి వచ్చి నెల అయినా సందడి ఏది?

By:  Tupaki Desk   |   16 Nov 2020 11:00 AM IST
అన్‌ లాక్‌ అనుమతి వచ్చి నెల అయినా సందడి ఏది?
X
కరోనా లాక్‌ డౌన్‌ తో మార్చి నెలలో మూతబడ్డ థియేటర్లు ఇప్పటి వరకు ఓపెన్‌ అవ్వలేదు. గత నెల 15వ తారీకు నుండి థియేటర్ల ఓపెన్‌ కు కేంద్రం నుండి అనుమతి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు థియేటర్లు ఓపెన్‌ అవుతాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అనుమతులు వచ్చిన వెంటనే థియేటర్లకు జనాలు క్యూ కడుతారని అంతా అనుకున్నారు. కాని థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఓపెన్‌ కు ఆసక్తి చూపడం లేదు. కొన్ని రాష్ట్రాలు థియేటర్లను ఓపెన్‌ చేసేందుకు ఓకే చెప్పినా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఓకే చెప్పలేదు.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు 5% కూడా ఓపెన్‌ అవ్వలేదు. డిసెంబర్‌ నుండి థియేటర్ల పునః ప్రారంభంకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో థియేటర్లు ఓపెన్‌ ఉన్న వాటికి కూడా ఎక్కువగా ఆక్యుపెన్సీ అవ్వలేదు. థియేటర్లను ఓపెన్‌ చేస్తే మెయింటెనెన్స్‌ భారీగా ఉంటుంది. దాన్ని భరించడం కష్టం అవుతుంది. కనుక ప్రేక్షకులు రాకుండా థియేటర్లను కొనసాగించడం ఆర్థికంగా చాలా భారంను నెత్తిన వేసుకోవడం అవుతుందని అంటున్నారు.

వచ్చే నెలలో అయినా ఏ మేరకు థియేటర్లు ఓపెన్‌ అవుతాయి.. ప్రేక్షకులు ఎంత వరకు వస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌ కు అలవాటు పడుతున్న సమయంలో థియేటర్ల మనుగడ ప్రమాదంలో పడ్డట్లు అవుతుంది. కరోనా నేపథ్యంలో థియేటర్లకు జనాలు రాకపోవచ్చు. వ్యాక్సిన్‌ వచ్చి పూర్తిగా కరోనా తగ్గి పోయింది అనుకుంటే అప్పుడు జనాలు థియేటర్ల ముందు క్యూ కడతారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ పరిస్థితి కాస్త అటు ఇటుగానే ఉండే అవకాశం ఉందంటున్నారు.