Begin typing your search above and press return to search.

సినీ ప్రముఖులు: లాక్ డౌన్ కు ముందు..తర్వాత!

By:  Tupaki Desk   |   11 May 2020 1:45 PM IST
సినీ ప్రముఖులు: లాక్ డౌన్ కు ముందు..తర్వాత!
X
సినిమా షూటింగ్ అంటే ఎంతో సందడి.. పదుల సంఖ్యలో ఆర్టిస్టులు.. ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు.. హీరోలు, హీరోయిన్లు.. కలిసి భోజనాలు.. చిట్ చాట్ లు.. షూటింగ్ అంటే ఓ పండుగే అని చెప్పవచ్చు. సినిమా షూటింగ్ అయిపోయినాక ఏడ్చిన నటులు ఎందరో ఉన్నారు. అందరినీ వదిలేస్తున్న బాధ వారిలో కనిపించేది.

అయితే ఇదంతా కరోనా-లాక్ డౌన్ కు ముందు కథ. ఆఫ్టర్ కరోనా సినిమా షూటింగ్ లు ఇలా జరిగేలా కనిపించడం లేదు. అంత దగ్గరగా నటీనటులు కలిసి కూర్చోవడం.. నిలబడడం.. తినడం కరోనాతో అసాధ్యమే..

షూటింగుల్లో హగ్గులు, మద్దులు, షేక్ హ్యాండ్ లు.. భుజాలు భుజాలు ఆనిచ్చుకోవడాలు ఇక చూడలేమేమో.. అంతా కరోనా ఎఫెక్ట్ మరీ.. అందుకే.. ఇప్పుడు ఆ నాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకొని సినీ ప్రముఖులు తల్లిడిల్లిపోతున్నారు. మళ్లీ ఇలా కలవలేమా అంటూ మథనపడుతున్నారు.

ఈ క్రమంలోనే ‘బాగా దగ్గరిగా బతికిన రోజుల్లో’ అంటూ ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్ చేశాడు. మొదటి ఫొటోలో హీరో రవితేజ, నటుడు సుబ్బరాజు, డైరెక్టర్లు మెహర్ రమేష్, హరీష్ శంకర్, బీవీఎస్ రవితో దిగిన ఫొటోలను షేర్ చేశాడు..

ఇక అతికిన రోజుల్లో అంటూ భుజాలు భుజాలు పట్టుకొని దిగిన మరో ఫొటోను షేర్ చేశాడు. అందులో హీరో పవన్ కళ్యాణ్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, అలీతో ‘గబ్బర్ సింగ్’ సినిమా ఫొటోను బ్రహ్మాజీ షేర్ చేశాడు..

మళ్లీ ఇంతటి అప్యాయత.. అనురాగం సాధ్యమేనా? అంటూ బ్రహ్మాజీ ఆ ఫొటోలను షేర్ చేసి గుర్తు చేసుకున్నాడు. కరోనా మన జీవితాల్లో ఎంత మార్పు తెచ్చింది అనడానికి ఈ ఫొటోలు నిదర్శనంగా మారాయి.