Begin typing your search above and press return to search.

గూస్‌ బంప్స్‌.. RRR ట్రైలర్ పై సినీ ప్రముఖుల స్పందన..!

By:  Tupaki Desk   |   9 Dec 2021 10:35 AM GMT
గూస్‌ బంప్స్‌.. RRR ట్రైలర్ పై సినీ ప్రముఖుల స్పందన..!
X
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన భారీ యాక్షన్‌ డ్రామా ''ఆర్‌.ఆర్‌.ఆర్‌''. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు గురువారం విడుదలైంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ అదరగొట్టారు.

అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు - గూస్ మాస్ తెప్పించే ఎలివేషన్స్ సీన్స్ - ఎమోషనల్ సీన్స్ - పవర్ ఫుల్ డైలాగ్స్ - అద్భుతమైన విజువల్స్ - కీరవాణి బీజేఎం - పవర్‌ ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్‌ లతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడం గ్యారెంటీ అని ట్రైలర్ చూసి అందరూ ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.

ఈ ట్రైలర్‌ అత్యద్భుతంగా ఉందని.. గూస్ బమ్స్ తెప్పిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం 'goosebumps' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ అవుతోంది. ఇక సినీ ప్రముఖులు సైతం 'RRR' టీమ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు.

''ట్రైలర్‌ చూస్తే గర్వంగా ఉంది. నెక్స్ట్ లెవల్‌ సినిమా ఇది RRR'' - విజయ్‌ దేవరకొండ

''RRR ట్రైలర్ ఖచ్చితంగా అద్భుతమైనది!.. గర్జన మనం అనుకున్నదానికంటే మరింత ఎక్కువగా మరింత బిగ్గరగా ఉంది. మనసుకు నచ్చింది. మన తారక్‌ - చరణ్‌ అద్భుతంగా ఉన్నారు. రాజమౌళి సర్‌ మైండ్‌ బ్లోయింగ్‌ విజన్‌ కి టేక్ ఏ బౌ'' - అనిల్‌ రావిపూడి

''ఇది భగవంతుని పని అని నేను ఖచ్చితంగా నమ్ముతాను'' - సందీప్ రెడ్డి వంగా

''నా గూస్‌ బంప్స్‌ కి గూస్‌బంప్స్ వచ్చాయి!'' - ప్రశాంత్ వర్మ

''ఈ అనుభూతిని వ్యక్తపరచడానికి నాకు పదాలు లేవు.. 'గూస్‌ బంప్స్' 'అడ్రినలిన్ రష్'.. RRR ట్రైలర్ చూసిన తర్వాత మానసిక స్థితిని వర్ణించడానికి సరిపోదు'' - హరీష్ శంకర్

''ఓహ్ మై గాడ్, లార్డ్, అల్లా, జీసస్!! ఏంటి ఈ RRR ట్రైలర్!! ఈ అద్భుతమైన ట్రైలర్ ను చూస్తున్నప్పుడు గూస్‌ బంప్స్ వస్తున్నాయి. దీన్ని బిగ్ స్క్రీన్‌ పై చూడటానికి వేచి ఉండలేను'' - మంచు లక్ష్మి

''అద్భుతమైన ఎలివేషన్స్‌ - పవర్‌ ఫుల్‌ పాత్రలు - మనసుని హత్తుకునే భావోద్వేగాలతో ‘RRR’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ మ్యాజిక్ ని వెండితెరపై చూసేందుకు ఆతృతగా ఉన్నాను'' - క్రిష్‌ జాగర్లమూడి

''అద్భుతమైన ట్రైలర్. ఉత్సాహభరితమైన మహోత్సవం కోసం టేక్‌ ఏ బౌ రాజమౌళి సార్. ఎన్టీఆర్ గారు - రామ్‌ చరణ్ గారు నిజంగా అద్భుతంగా ఉన్నారు! జనవరి 7 కోసం వేచి ఉన్నాను'' - గోపీచంద్‌ మలినేని

''గూస్‌ బంప్స్ అక్షరాలా.. #RRR ట్రైలర్ ఆద్యంతం సర్‌ప్రైజ్‌లతో నిండిపోయింది. భావోద్వేగాలు, ఎలివేషన్స్‌ పై తనకున్న పట్టుని రాజమౌళి సార్ మరోసారి నిరూపించారు. తారక్ - చరణ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ తో రాణించారు. బిగ్ స్క్రీన్‌ పై చూడటానికి వేచి ఉండలేము'' - బాబీ

''అతిపెద్ద గ్లోబల్‌ యాక్షన్‌ డ్రామా అనే టైటిల్‌ ఈ ట్రైలర్‌ కి సరిగ్గా సరిపోతుంది. అద్భుతమైన ప్రపంచం - పాత్రలు.. చూస్తుంటే మాటలు రావడం లేదు. వారి విజన్ కు కృషికి నా అభినందనలు'' - మారుతి

''అద్భుతమైన విజువల్స్‌ చూశాక మాటలు రావడం లేదు.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌.. కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్ ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో ప్రతిఒక్కరూ ఎంతలా శ్రమించారో ప్రతి ఫ్రేమ్‌ లో తెలుస్తోంది. రాజమౌళి గారికి అభినందనలు'' - వెంకీ కుడుముల

''ఎమోషన్‌ - యాక్షన్‌ ల పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌. ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ ల స్క్రీన్‌ ప్రజెన్స్‌ అదరగొట్టేలా ఉంది. మా అంచనాలకు మించి ఈ సినిమా ట్రైలర్‌ ఉంది. మన దేశంలో పుట్టిన ఉత్తమమైన దర్శకుడు రాజమౌళి'' - కోన వెంకట్‌

''రాజమౌళి సార్!!! ఈ ఎపిక్ ట్రయిలర్ యొక్క బ్రిలియన్స్ మరియు మాగ్నిట్యూడ్‌ ని చూసి ఆశ్చర్యపోయారు! వావ్!!! ఎన్టీఆర్ - రామ్‌ చరణ్‌ - అజయ్‌ దేవ్‌ గణ్‌ - ఆలియా భట్‌ తోపాటు ఈ అత్యంత భారీ చిత్రం మొత్తం తారాగణం మరియు సిబ్బందికి అభినందనలు'' - కరణ్‌ జోహార్‌