Begin typing your search above and press return to search.

మన సినీ ప్రముఖులు.. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో తెలుసా.?

By:  Tupaki Desk   |   14 April 2020 7:00 AM IST
మన సినీ ప్రముఖులు.. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారో తెలుసా.?
X
తెరపై హీరోలుగా ఎదిగి క్రేజ్ సంపాదించుకున్న ఎంతో మంది అద్భుత నటులు తమ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఆదర్శాలకు తిలోదకాలిచ్చేశారు. ఏకపత్నీ వత్రం పాటించిన రాముడి అడుగుజాడల్లో వారు నడవడం లేదు.. తమకున్న వ్యక్తిత్వం, నటన, టాలెంట్ లతో పాపులర్ అయ్యే సెలబ్రెటీలు, పర్సనల్ విషయాల్లో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం విశేషం.

ప్రేమ, పెళ్లి ఈ రెండు పదాలు మన తారలకు తరచూ పరిచయం అయ్యాయి. డ్రెస్సు మార్చినంత ఈజీగా భార్య/ భర్తలను మార్చిన నటులు, నటీనటులు మన ఇండస్ట్రీలో ఉన్నారు.. అంతేకాదు.. తమకంటే ఎంతో చిన్నవారైన వారిని పెళ్లి చేసుకొని బిడ్డలను కన్న ప్రముఖ తారలు ఉన్నారు. రోమాన్స్ కు వయసుకు మధ్య అసలు సంబంధం లేదని వారు నిరూపించారు. అగ్రహీరోలు, హీరోయిన్లుగా ఎదిగిన తారలు చాలామంది సినిమాల్లో నటిస్తూ ప్రేమలో పడి భార్యను వదిలేసిన వాళ్లు ఉన్నారు. మొగుళ్లకు విడాకులు ఇచ్చిన హీరోయిన్స్ కూడా ఉన్నారు.

కానీ ఈ మధ్య కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ మాత్రం తన భార్యతో విడాకులు కోరుకొని తన కూతురు కోసం మళ్లీ విడాకులు రద్దు చేసుకొని భార్యను చేరదీయడం విశేషంగా చెప్పవచ్చు. కన్నడ స్టార్ అయితే అలా చేశాడు కానీ మన తెలుగు, తమిళ, హిందీ తారలు మాత్రం సుదీప్ అడుగుజాడల్లో నడవకుండా బహుపెళ్లిళ్లకే మొగ్గుచూపారు. ఎవరా తారలు..? ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు.? తమ వయసు వారినే చేసుకున్నారా.? చిన్నవారిని చేసుకున్నారా లాంటి ఇంట్రస్టింగ్ అంశాలపై ప్రత్యేక కథనం..

* పవన్ కళ్యాణ్
తెలుగు హీరోల్లో అత్యధిక పెళ్లిళ్లు చేసుకుంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణే.. ముచ్చటగా మూడు పెళ్లిళ్లతో.. వార్తల్లో పాపులర్ అయ్యాడు.. పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి వైజాగ్ కు చెందిన నందిని ని చేసుకుని 2008లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రముఖ కధానాయకి 'రేణు దేశాయ్' ని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత 2012లో ఆమెతో బంధానికి వీడ్కోలు చెప్పాడు. ఆ తర్వాత 2013లో రష్యాకు చెందిన నటి.. 'అన్నా లెజ్నావెని' పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమెతోనే ఉంటున్నాడు.

* నాగార్జున
ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీని పెళ్లి చేసుకొని ఆరేళ్ల తర్వాత విడాకులతో.. విడిపోయారు. ఈ దంపతులకు ఒక కుమారుడు నాగచైతన్య ఉన్నాడు.. ఆ తర్వాత నటి అమలాను 1992లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి హీరో అఖిల్ పుట్టాడు..

* కమల్ హాసన్
కమల్ హాసన్ 1988లో సారికాను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఈ స్టార్ కి రెండో పెళ్లి. అంతకు ముందు డ్యాన్సర్ వాణీ గణపతిని పెళ్లి చేసుకుని 10 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రస్తుతం అనధికారికంగా నటి గౌతమితో కమల్ హాసన్ పెళ్లిచేసుకోకుండా సహజీవనం చేస్తున్నాడు.

* కృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ హీరో అయిన సూపర్ స్టార్ క్రిష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట 1961లో ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు. వారికి మహేశ్ బాబు, రమేశ్ బాబు, మంజుల సంతానం. ఆ తర్వాత 1969లో నటి విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాడు. విజయ నిర్మలాకు కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం.

*మంచు మనోజ్
మోహన్ బాబు లాంటి స్ట్రిక్ట్ తండ్రి పెంపకంలో పెరిగిన మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డితో విడిపోతాడని అస్సలు ఊహించలేదు. పెళ్లి అయి మూడేళ్లు కూడా దాటకుండానే మంచు మనోజ్-ప్రణతిరెడ్డిలు విభేదాలతో విడిపోయారు. మనోజ్ విడాకులు టాలీవుడ్ లో సంచలనమయ్యాయి.

*ప్రకాష్ కోవెలమూడి
దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెల మూడి కూడా 2014లో కనిక దిల్లాన్ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె ఒక సినీ రచయిత్రి. వీళ్లద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

* హీరో సుమంత్
ప్రముఖ అక్కినేని కుటుంబ హీరో సుమంత్ కూడా విడాకులు తీసుకున్నాడు. ప్రేమించి మరీ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నా వీరు కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. సుమంత్ మాత్రం ఇక మళ్లీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.

* రాధిక
అలనాటి అందాల భామ రాధిక 1985లో దర్శకుడు 'ప్రతాప్ పోతన్' ని పెళ్లి చేసుకుంది. తర్వాత అతనికి డైవర్స్ ఇచ్చి.. లండన్ కి చెందిన 'రిచర్డ్ హార్డ్లీ'ని రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కూతురు ఉంది. ఈ పెళ్లి కూడా ఎక్కువకాలం నిలవలేదు. ప్రస్తుత రాధిక, శరత్ కుమార్ తో ప్రేమలో పడి.. 2001లో పెళ్లి చేసుకున్నారు

* ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. మొదట లలితా కుమారీని పెళ్లి చేసుకున్నాడు.. 15 ఏళ్ల తర్వాత 2009లో డైవర్స్ ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత 2010లో కొరియోగ్రాఫర్ 'పోనీ వర్మా' ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరికి ఒక కుమారుడు.

* సీనియర్ ఎన్టీఆర్
విశ్వ, విఖ్యాత, నటసార భౌముడిగా , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ 1942లో తనకు 20 ఏళ్ల వయసులో 'బసవతారకం'ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ.. 12మంది పిల్లలు. ఆ తర్వాత 1993లో 70 ఏళ్ల వయసులో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ పార్వతికి కూడా ఇది రెండో వివాహం.

ఇలా తెరపై అద్భుత నటనతో అలరించే మన తారలు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఎగుడుదిగుడులను ఎదుర్కొన్నారు. బహుభార్యత్వాన్ని కొనసాగించారు.