Begin typing your search above and press return to search.

సిగరెట్ తాగడం కొంచెం కష్టమే: కృతి శెట్టి

By:  Tupaki Desk   |   23 Jun 2022 2:30 AM GMT
సిగరెట్ తాగడం కొంచెం కష్టమే: కృతి శెట్టి
X
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో కృతి శెట్టి ఒకరు. వెండితెరపై వెన్నముద్దలాంటి ఈ అమ్మాయిని చూడగానే కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులను పారేసుకున్నారు. తొలి సినిమా 'ఉప్పెన'తోనే ఈ అమ్మాయి అభిమాన సంఘాలకు అంకురార్పణ చేసింది. ఆమె పోస్టర్స్ చూసే అభిమానులైపోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఆ సినిమా ఆ స్థాయి వసూళ్లు సాధించడంలో ఈ సుందరి పాత్రనే ఎక్కువనే టాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కుర్రాళ్లందరికీ అదొక ఊహల ఉప్పెనగానే మిగిలిపోయింది.

సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఫస్టు సినిమా హిట్ కావాలని అంతా బలంగా కోరుకుంటారు. కానీ కృతి మాత్రం నేరుగా హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. 'ఉప్పెన' తరువాత ఆమె చేసిన 'శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు' కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి.

దాంతో ముద్దబంతిలాంటి ఈ అమ్మాయికి గోల్డెన్ లెగ్ అనే పేరు వచ్చేసింది. ఆమె నుంచి రావడానికి ఇప్పుడు మూడు సినిమాలు ముస్తాబవుతున్నాయి. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. 'ది వారియర్' .. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి.

అందంగా .. అమాయకంగా కనిపించే కృతి, 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది. ఆడియన్స్ కి ఈ సీన్ బాగా కనెక్ట్ అయింది. ఇంత క్యూట్ గా సిగరెట్ తాగే బ్యూటీని ఇంతవరకూ చూడలేదని అంతా చెప్పుకున్నారు. ఆ సీన్ గురించి కృతి మాట్లాడుతూ .. " ఈ సినిమాలో నేను కీర్తి పాత్రను పోషించాను.

చిన్నప్పటి నుంచి కూడా నాకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు. కానీ 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో సిగరెట్ తాగాలని చెప్పారు. సిగరెట్ నాకు అసలే ఇష్టం ఉండదు .. ఆ సీన్ తీసేయండి అని నేను డైరెక్టర్ రాహుల్ గారికి చెప్పాను. కెమెరా ముందు సిగరెట్ తాగేది కృతి కాదు కీర్తి అని ఆయన అన్నారు.

అప్పుడు ఆరోగ్యానికి ఇబ్బంది లేదంటూ ఏదో సిగరెట్ తెచ్చి ఇచ్చారు. అయితే ఆ సిగరెట్ పట్టుకోగానే నా చేతులు ఒణుకుతున్నాయి. దాంతో ఆ రోజుకి ఆ సీన్ ఆపేసి మూడు రోజుల పాటు సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేయించారు. ఆ తరువాత ఆ షాట్ ను తీశారు. నాని సార్ నాకు చాలా కంఫర్టును ఇచ్చారు. అందువల్లనే ఆ సినిమాలో నేను బాగా చేయగలిగాను. నటన పరంగా ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇకపై కూడా మంచి పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు వెళతాను" అంటూ చెప్పుకొచ్చింది.