Begin typing your search above and press return to search.

కూతురుపై జోక్.. కామెడీ అంటున్నాడు

By:  Tupaki Desk   |   2 Sep 2017 6:02 AM GMT
కూతురుపై జోక్.. కామెడీ అంటున్నాడు
X
కొన్నిసార్లు కామెంట్స్ మితిమీరుతుంటాయి. సెన్సాఫ్ హ్యూమర్ పరిధులు దాటుతుంటుంది. మనసులో అనుకున్న ప్రతీదీ బయటకు చెప్పేస్తే సిట్యుయేషన్ ఇదుగో.. ఇలా చుంకీ పాండే పరిస్థితి టైపులో తయారవుతుంది.

చుంకీ పాండే కూతురు అనన్య పాండే ఫోటో ఒకటి రీసెంట్ గా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఇంత అందంగా కనిపించడం.. అంతకు మించి సౌందర్యాన్ని ధారపోయడం చాలా మందికి షాక్ ఇఛ్చేసింది.. ఈ దెబ్బకి ఫోటో తెగ వైరల్ అయిపోయింది. అనేక మంది ఈ ఫోటోకు పొగడ్తలు కురిపించారు కానీ.. డైరెక్టర్ ఫరా ఖాన్ చేసిన కామెంట్ మాత్రం తప్పుదోవ పట్టేసింది. "అనన్య చాలా అందంగా కనిపిస్తుందే. తను చుంకీ పాండే కూతురే అని నిరూపించుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందే" అనేసింది ఫరా ఖాన్. అయితే.. ఈ డీఎన్ఏ టెస్ట్ కామెంట్స్ నెటిజన్స్ కు పెద్దగా ఎక్కలేదు సరికదా.. చుంకీ పాండేను కూడా తీవ్రంగా కలచివేశాయని టాక్ వచ్చింది.

అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ డీఎన్ ఏ టెస్ట్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యాడు చుంకీ పాండే. "నేను దీన్ని ఓ కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నాను. ఆమె ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలుసు. నాకు తను ఎంతో దగ్గరైన ఫ్రెండ్. ఇతర విషయాలను నేను పెద్దగా పట్టించుకోను. సహజంగా మేం ఇలాంటి జోక్స్ పేల్చుకుంటూనే ఉంటాం. ఆమె సెన్సాఫ్ హ్యూమర్ సూపర్" అంటున్నాడు చుంకీ పాండే. నిజానికి ఫరా ఖాన్ కూడా కేవలం నవ్వులాటకే ఈ జోక్ పేల్చింది తప్ప.. మరో ఉద్దేశ్యం ఆమెకు కూడా లేదనే చెప్పాలి.