Begin typing your search above and press return to search.

వ్యభిచారంతో అంతా మంచే అంటున్నాడు

By:  Tupaki Desk   |   4 April 2017 11:48 AM GMT
వ్యభిచారంతో అంతా మంచే అంటున్నాడు
X
విద్యా బాలన్ లీడ్ రోల్ లో నటించిన బేగమ్ జాన్ ఈ నెల 14న రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఇప్పటికే రిలీజ్ ట్రైలర్ సినిమాపై బోలెడంత ఆసక్తిని కలిగించేయడమే కాదు.. డర్టీ భామ ఖాతాలో మరో హిట్టు మూవీ పడబోతోందనే అంచనాలను కలిగించేసింది.

వేశ్యావృత్తి ఇతివృత్తంతో రూపొందిన బేగమ్ జాన్ లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ అయిపోతున్నాయి. "మన దేశంలో అతి ప్రాచీన కాలం నుంచి ఆచారంగాను అలవాటుగాను వస్తున్న వృత్తులలో వ్యభిచారం కూడా ఒకటి. అయితే.. కొన్ని కారణాలు.. పరిస్థితులతో ఇక్కడ దీన్ని నిషేధించారు. కానీ వేశ్యా వృత్తితో మంచే జరుగుతుంది. దేశానికి మేలు జరుగుతుంది కూడా. మన దేశంలో దీన్ని చట్టబద్ధంగా అనుమతించాల్సిన అవసరం ఉంది. భారత్ లో సెక్సువల్ ఫ్రస్టేషన్ ఎక్కువ అని పలు సంఘటనలు ప్రూవ్ చేస్తున్నాయి. వేశ్యావృత్తిని లీగలైజ్ చేస్తే.. ఇలాంటివి తగ్గుతాయి" అని అభిప్రాయపడ్డాడు చుంకీ పాండే.

ఇక సినిమా గురించి చెబుతూ.. ఈ మూవీలో అసభ్యత ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారని.. కానీ బేగమ్ జాన్ లో బోల్డ్ సీన్స్ కానీ.. సమాజం సిగ్గుపడాల్సిన సన్నివేశాలు కానీ ఉండవని చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/