Begin typing your search above and press return to search.

విలన్ నెం 3 వచ్చేశాడు - సాహో లుక్

By:  Tupaki Desk   |   7 Aug 2019 10:39 AM GMT
విలన్ నెం 3 వచ్చేశాడు - సాహో లుక్
X
రోజుకో విలన్ ని పరిచయం చేస్తూ వేడి పెంచుతున్న సాహో టీం ఇవాళ చుంకీ పాండేని దించింది. ఇలాంటి గ్రాండ్ విజువల్ యాక్షన్ ఎంటర్ టైనర్లో ఒకరిద్దరు విలన్లు ఉంటె ప్రభాస్ కు వచ్చే కిక్ ఏముంది. అందుకే దర్శకుడు సుజిత్ పెద్ద బాలీవుడ్ బ్యాచ్ నే ఇందులో సెటప్ చేసాడు. పోస్టర్ల మీద ప్రతి ఒక్క విలన్ కి ఓ క్యాప్షన్ ఇస్తున్న సాహో టీం ఇతనికీ ట్యాగ్ తగిలించింది.

రైజ్ ఫ్రం ది యాషెస్ అంటే ఏమి లేని బూడిద నుంచి అత్యున్నతంగా అందరిని అణగదొక్కి ఎదిగిన వాడు అని అర్థం వచ్చేలా దీన్ని డిజైన్ చేసిన తీరు బాగుంది. టీజర్ లోనూ గట్టిగా అరుస్తూ కనిపించే చుంకీ లుక్స్ ఆల్రెడీ మనవాళ్ళకు కనెక్ట్ అయిపోయాయి. ముప్పై ఏళ్ళ క్రితం పరిశ్రమకు వచ్చిన చుంకీ పాండే హిందిలో మంచి పేరు ఉంది. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో అనిల్ కపూర్ తో చేసిన తేజాబ్ ఇతనికి పెద్ద బ్రేక్ గా నిలిచింది.

వెంకటేష్ పోకిరి రాజా ఒరిజినల్ వెర్షన్ ఆంఖేలో గోవిందా ఫ్రెండ్ గా నటించి మరో గొప్ప మలుపు అందుకున్న చుంకీ ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కొంత గ్యాప్ తర్వాత కొన్నేళ్ళ క్రితమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం విలన్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తెలుగులో ఇతనికి ఇదే మొదటి సినిమా. ప్రభాస్ మ్యాన్లీ నెస్ కు తగ్గట్టే ఒక్కో విలన్ ని బయటికి తీసుకొస్తున్న తీరు చూస్తుంటే రేపు ఎవరు రాబోతున్నరన్న సస్పెన్స్ ఎక్కువవుతోంది