Begin typing your search above and press return to search.

క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఈ సారి హిస్టారిక‌ల్ ఎపిక్ తో..

By:  Tupaki Desk   |   10 Oct 2021 11:30 PM GMT
క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఈ సారి హిస్టారిక‌ల్ ఎపిక్ తో..
X
హాలీవుడ్ ప్యాష‌నేట్ మూవీ మేక‌ర్ క్రిష్టాఫ‌ర్ నోల‌న్‌. వ‌ర‌ల్డ్ వైడ్ ‌గా మేక‌ర్ గా మంచి పేరుతో పాటు సంచ‌ల‌న‌మైన చిత్రాల‌ని అందించి డైరెక్ట‌ర్‌ గా ఎంతో మందికి హాట్ ఫేవ‌రేట్ ‌గా నిలిచారు. ఇటీవ‌ల `టెనెట్‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన క్రిస్టోఫ‌ర్ నోల‌న్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్దం ఆధారంగా ఒక చారిత్ర‌క ఇతిహాసంతో ఓ మూవీని చేస్తున్నారు. ఇదిప్పుడు హాలీవుడ్ ‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

అమెరిక‌న్ ఫిజిసిస్ట్ జె. రాబ‌ర్ట్ ఓపెన్ హీమ‌ర్ జీవితం ఆధారంగ‌ అమెరికన్ ఫిజిసిస్ట్ జె. రాబర్ట్ ఒపెన్‌ హైమర్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెర‌పైకి తీసుకొస్తున్నారు. దీనికి `ఓపెన్ హీమ‌ర్` అనే టైటిల్‌ని కూడా ఖ‌రారు చేశారు. ఈ విల‌క్ష‌ణ‌మైన చారిత్ర‌క చిత్రంలో పీకీ బ్లైండ‌ర్స్ స్టార్ సిలియ‌న్ మ‌ర్ఫీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

నోల‌న్ గ‌తంలో సిలియ‌న్ మ‌ర్ఫీ తో క‌లిసి బ్యాట్మిన్ బిగిన్స్‌.. డంకిర్క్ .. ఇన్సెప్ష‌న్ వంటి సినిమాల‌కు ప‌ని చేశారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌పైకి రాబోతున్న ఈ విజువ‌ల్ వండ‌ర్‌ ని యూనివ‌ర్స‌ల్ పిక్చ‌ర్స్ 100 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నోల‌న్ త‌న గ‌త చిత్రాల త‌రహాలోనే ఈ చిత్రాన్ని ఐమాక్స్ కెమెరాల‌ని ఉప‌యోగిస్తున్నార‌ట‌.

టెక్నిక‌ల్ ‌గానూ అత్యంత హై స్టాండ‌ర్డ్స్‌లో వుండ‌నున్న ఈ చిత్రాన్ని 2023.. జూలై 23న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది అంటే 2022 ప్రారంభంలో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ లాంఛ‌నంగా ప్రారంభం మ‌వుతుంది. కైబ‌ర్డ్.. మార్టిన్ జె. షెర్విన్ రాసిన `అమెరిక‌న్ ప్రోమేతియ‌స్ : ది ట్ర‌యంఫ్ అండ్ జె. రాబ‌ర్ట్ ఓపెన్ హైమ‌ర్` అనే అవార్డు విన్నింగ్ బుక్ ఆధారంగా ఈ మూవీని రూపొందించ‌బోతున్నారు.

నోల‌న్ క‌థ‌ని సిద్ధం చేశారు. నోల‌న్ వైఫ్ ఎమ్మా థామ్స‌న్ .. అట్లాస్ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ చార్లెస్ రోవెన్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది.