Begin typing your search above and press return to search.
థియేటర్లలోకి ఓ క్రేజీ మూవీ..ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
By: Tupaki Desk | 23 Nov 2020 2:40 PM ISTకరోనా దెబ్బకు థియేటర్లు మూతపడ్డాయి. సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. దీంతో ఆ రంగం మీద ఆధారపడి బతుకుతున్న వేలమంది బతుకులు రోడ్డున పడ్డాయి. లాక్డౌన్ ఎత్తేశాఖ కూడా సినీరంగం పుంజుకోలేదు. థియేటర్లు తెరచుకున్నా సవాలక్ష నిబంధనలు విధించారు. కరోనాకు బయపడి ప్రేక్షకులు కూడా థియేటర్ కి వచ్చే పరిస్థితి లేదు. షూటింగ్లకు అనుమతి ఇచ్చినా అనేక నిబంధనలు విధించారు. సెట్స్ లో వందల సంఖ్యలో కూలీలు అవసరం కాగా అందుకు కూడా ఆంక్షలు విధించారు. ఇన్ని నిబంధనల మధ్య పెద్ద సినిమాలు సైతం ఓటీటీలోనే విడుదల చేసే పరిస్థితి నెలకొన్నది.
థియేటర్లు తెరుచుకొనేందుకు అనుమతులు వచ్చినా పూర్తిస్థాయిలో రాలేదు. 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదలవుతేనే ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్న వారికి ఉపాధి దొరుకుతుంది. దీంతో విడుదలకు సిద్ధమైన కొన్ని పెద్ద సినిమాలు కూడా థియేటర్లలోకి రావడం లేదు. ఆంక్షల మధ్య కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నా జనం వాటిని పట్టించుకోవడం లేదు. ఓ పెద్ద సినిమా పడితే గానీ జనం థియేటర్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
అయితే ఇప్పుడో హాలీవుడ్ మూవీ థియేటర్లలోకి రానున్నది. ప్రపంచ నంబర్ వన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘టెనెట్’ మనదేశంలో రిలీజ్ కానున్నది. డిసెంబర్ 4 న ఈ చిత్రాన్ని ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యేనాటికి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. లాక్డౌన్ టైంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైనప్పటికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేస్తున్నారు. అయితే 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం వస్తే రిలీజ్ చేసేందుకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. చాలా మంది ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.