Begin typing your search above and press return to search.

క్రిస్టోఫర్ మరో ప్రయోగం.. అణుబాంబు లాంటి బయోపిక్

By:  Tupaki Desk   |   22 July 2022 12:20 PM GMT
క్రిస్టోఫర్ మరో ప్రయోగం.. అణుబాంబు లాంటి బయోపిక్
X
హాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరపైకి తీసుకు వచ్చిన క్రియేటివ్ దర్శకులలో క్రిస్టోఫర్ నోలన్ ఒకరు. ప్రపంచవ్యాప్తంగా అగ్ర దర్శకుల లిస్ట్ లో ఆయన ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఆయన తన మార్క్ చూపిస్తూ ఉంటారు.

ది బాట్‌మ్యాన్, ఇన్‌సెప్షన్, టెనెట్‌ సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ త్వరలోనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఓపెన్‌హైమర్ అనే మరో బిగ్ బడ్జెట్ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసేందుకు వస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో సినిమా కథాంశాన్ని తెలియజేశారు. పోస్టర్‌లో సిలియన్ మర్ఫీ అణుబాంబు పేలుడు పొగను చూపించాడు.

ఫస్ట్ లుక్ తోనే సినిమా ట్యాగ్ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌ కు నాయకత్వం వహించిన జె రాబర్ట్ ఓపెన్‌హైమర్ యొక్క బయోపిక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఓపెన్‌హైమర్ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్, రామి మాలెక్ అలాగే ఇతర ప్రముఖ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

ఇక సినిమాను ఈ ఏడాది చివరలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయితే 2023 జూలై 21 ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమా.ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమా అనంతరం దర్శకుడు క్రిస్టోఫర్ మరో రెండు ఆసక్తికరమైన సినిమాలకి సీక్వెల్స్ ప్రకటించనున్నట్లు సమాచారం.