Begin typing your search above and press return to search.
13ఏళ్ల తర్వాత 'ఇన్సెప్షన్' క్లైమాక్స్ రహస్యం చెప్పేసిన నోలాన్
By: Tupaki Desk | 27 Jun 2023 3:44 PM ISTక్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించే ఒక్కో సినిమా ఒక్కో క్లాసిక్ గా ప్రపంచ సినీచరిత్రలో నిలిచాయి. అభిమానుల హృదయాల్లో ఇవి యూనిక్ గా నిలిచాయి. తన సినిమాలతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ లు కొల్లగొట్టడం నోలాన్ కి వెన్నతో పెట్టిన విద్య. అతడు తెరకెక్కించిన సంచలనాల 'ఇన్సెప్షన్'(2013) పలు అకాడెమీ(ఆస్కార్) పురస్కారాలను గెలుచుకుంది. అయితే ఇన్సెప్షన్ చూసిన తర్వాత ప్రతి ఒక్క అభిమానికి ఒక సందేహం అలానే మిగిలిపోయింది. ఈ సినిమా పతాక సన్నివేశాల్లో ముగింపును చూపించాడా లేదా? లేక పార్ట్ 2 ని తెరకెక్కిస్తారా? అంటూ నోలాన్ ని ప్రశ్నించేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
ఇన్సెప్షన్ క్రిప్టిక్ క్లైమాక్స్ కి సంబంధించిన సస్పెన్స్ ఇన్నాళ్లు వీడలేదు. కలల ప్రపంచంలో ఒక కల నుంచి ఇంకో కలలోకి ప్రయాణిండం తిరిగి ఒక్కో కలను ఛేధిస్తూ వెనక్కి రావడం అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో నోలాన్ రూపొందించిన ఇన్సెప్షన్ ప్రపంచసినీచరిత్రంలో ఒక క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమా సారాంశాన్ని సామాన్యులు అర్థం చేసుకోవడం అంత సులువైన పని కాదు.
ఎట్టకేలకు 'ఇన్ సెప్షన్' ముగింపుపై నోలాన్ మౌనాన్ని వీడాడు. ఆ చిత్రం విడుదలైన 13 సంవత్సరాల తర్వాత అతడు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయ్యాడు. అంతేకాదు.. ఈ చిత్రానికి 'ఓపెన్ హైమర్'(జూలై రిలీజ్)తో సంబంధం ఉందని కూడా సూచించాడు. నిజానికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నోలన్ చిత్రం ఓపెన్ హైమర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది రహస్యం కాదు. 2023 మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఓపెన్ హైమర్ ఒకటి. అణుబాంబ్ తయారీ.. విస్పోటనం నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం రక్తి కట్టించే బయోగ్రఫికల్ కథాంశంగా ఉంటుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ వెల్లడించింది.
ఇకపోతే ఓపెన్ హైమర్ ప్రచారంలో ఇన్సెప్షన్ క్లైమాక్స్ కి సంబంధించిన రహస్యంపై నోలాన్ ఓపెన్ గా మాట్లాడారు. నిజానికి కల్ట్ క్లాసిక్ 'ఇన్ సెప్షన్' విడుదలై 13ఏళ్లు అయింది. 2013లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటివరకు ప్రపంచంలో తీసిన గొప్ప సినిమాలలో ఒకటిగా ఈ సినిమా రికార్డుల్లో ఉంది. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ ఇప్పటికీ పరిశ్రమ దిగ్గజాలకు కానీ సామాన్యులకు కానీ ఒక ఫజిల్ లానే ఉంది. ఇన్సెప్షన్ క్లైమాక్స్ గందరగోళం నుంచి ఇంకా ఎవరూ బయటపడలేదు. దానికి తగ్గట్టే నోలాన్ ఏనాడూ దీనిపై పెదవి విప్పకపోవడంతో సస్పెన్స్ అలానే సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.
13 సంవత్సరాల తర్వాత నోలాన్ ఎట్టకేలకు తన సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇన్సెప్షన్ ముగింపుపై మౌనం వీడాడు. ప్రఖ్యాత 'వైర్డ్' మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సిద్ధాంతాలు అందరికీ అర్థంకానివని అయితే అవన్నీ ప్రాపంచిక నిజాలు అని తెలిపాడు. ఇన్సెప్షన్ లో డోమ్ కాబ్ పాత్రధారి లియోనార్డో డికాప్రియో చివరకు వెళ్లి అతని పిల్లలతో తిరిగి కలుస్తాడు. చనిపోయిన వారిని అతడు నిజంగానే తిరిగి కలల్లో కలవగలుగుతాడు.. అని తెలిపాడు.
ఇన్సెప్షన్ కి 'ఓపెన్ హైమర్' కనెక్షన్?
సిలియన్ మర్ఫీ టైటిల్ రోల్ లో నటించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ 'ఓపెన్ హైమర్' ట్రైలర్ విడుదల తర్వాత ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆశ్చర్యకరంగా తాజా ప్రమోషన్స్ లో నోలాన్ ఇన్ సెప్షన్స్ ముగింపుకు ఓపెన్ హైమర్ ని కనెక్ట్ చేశానని తెలిపాడు. ''ఇది తమాషా విషయం... అన్వేషించదగిన ఇన్ సెప్షన్ .. ఓపెన్‌హైమర్ ముగింపుల మధ్య ఆసక్తికరమైన సంబంధం ఉంది. ఓపెన్ హైమర్ సంక్లిష్టమైన క్లైమాక్స్ తో మీ బుర్రలకు పదును పెడుతుంది. నా సంక్లిష్టమైన భావాలను తెరపై చూస్తారు'' అంటూ నోలాన్ క్రిప్టిక్ గా మాట్లాడారు. ప్రఖ్యాత నటుడు సిలియన్ కాకుండా Oppenheimer లో భారీ తారాగణం నటించింది. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్- ఎమిలీ బ్లంట్ - మాట్ డామన్- రామి మాలెక్- ఫ్లోరెన్స్ పగ్ లాంటి దిగ్గజ తారలు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 21న సినిమా థియేటర్లలోకి రానుంది