Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మహేష్‌ ఇంట క్రిస్మస్ సంబరాలు

By:  Tupaki Desk   |   30 Nov 2016 11:10 AM IST
ఫోటో స్టోరి: మహేష్‌ ఇంట క్రిస్మస్ సంబరాలు
X
మహేష్ బాబు కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో చాలా సార్లే చూశాం. ప్రతీ పండక్కి ప్రతీ సందర్భానికి ఫ్యామిలీని ఏ మాత్రం మిస్ కాకుండా.. భార్యా పిల్లలతో సహా ప్రపంచమంతా చక్కర్లు కొట్టేస్తుంటాడు మహేష్. అలాగే మహేష్ భార్య నమ్రత.. అటు భర్త ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు.. ఇటు పిల్లలపై కూడా పూర్తి కాన్సంట్రేషన్ పెడుతూ ఉంటుంది.

క్రిస్మస్ నుంచి మొదలుపెట్టి.. న్యూఇయర్ పూర్తయ్యే వరకూ సూపర్ స్టార్ ఫ్యామిలీ మొత్తం యూకే టూర్ వెళుతున్న సంగతి ఇప్పటికే చెప్పుకున్నాం. మహేష్ ఇంట క్రిస్మస్ సంబరాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. తన ఇద్దరు పిల్లలు గౌతమ్.. సితారలు ఒకేరకమైన క్రిస్మస్ కళ్లజోడు పెట్టుకున్న ఫోటోను నమ్రత పోస్ట్ చేసింది. అన్నాచెల్లెళ్లిద్దరూ ఒకే రకమైన కళ్లజోడుతో.. ఒకే రకమైన నవ్వులతో భలే ముద్దు ముద్దుగా ఉన్నారు. క్రిస్మస్ కి ఇంకా నాలుగువారాల సమయం ఉన్నా.. ' సంబరాలు మొదలైపోయాయ్' అంటూ నమ్రత చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.

మరోవైపు మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అహ్మదాబాద్ లో యాక్షన్ సీన్స్ తో ఎపిసోడ్ డిసెంబర్ 23 వరకూ షూట్ చేయనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/