Begin typing your search above and press return to search.

అవెంజర్‌ స్టార్‌ కూతురు పేరు 'ఇండియా' ఎందుకంటే?

By:  Tupaki Desk   |   10 Jun 2019 8:47 AM GMT
అవెంజర్‌ స్టార్‌ కూతురు పేరు ఇండియా ఎందుకంటే?
X
హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌ వర్త్‌ అవెంజర్స్‌ చిత్రంతో చాలా ఫేమస్‌ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్న హెమ్స్‌ వర్త్‌ ను అభిమానులు అవెంజర్స్‌ క్యారెక్టర్‌ పేరు అయిన థార్‌ అంటూ పిలుస్తూ ఉంటారు. క్రిస్‌ హెమ్స్‌ తన సొంత పేరుతో కంటే థార్‌ తోనే ఎక్కువగా పిలవబడుతూ ఉంటాడు. తాజాగా ఈయన తన కొత్త సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన కూతురుకు ఇండియా అని పేరు పెట్టడం గురించి స్పందించాడు.

థార్‌ తన కూతురుకు ఇండియా అంటూ పేరు పెడుతున్నట్లుగా చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. ఆ సమయంలో కారణం ఏంటీ అనే విషయాన్ని పెద్దగా చెప్పలేదు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్బంగా.. తన భార్య ఎల్సా కొన్ని పనుల కారణంగా ఇండియాలో చాలా కాలం గడిపింది. ఆమెకు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే తమ కూతురుకు ఇండియా అనే పేరు పెట్టుకున్నాం అంటూ థార్‌ చెప్పుకొచ్చాడు.

థార్‌ కు కూడా ఇండియా అంటే చాలా ప్రత్యేకమైన అభిమానమట. ఎప్పుడైనా ఇండియాలో ఔట్‌ డోర్‌ షూటింగ్‌ చేయడం అంటే చాలా ఇష్టమట. ఇండియాలో ఔట్‌ డోర్‌ షూట్‌ చేసే సమయంలో వేలాది మంది రావడం.. షూటింగ్‌ ను చూస్తూ ఉండటం జరుగుతుంది. అందులోంచి జనాలు థార్‌ అంటూ పిలుస్తుంటే నాకు చాలా ఉద్వేగ భరితంగా అనిపించేదంటూ చెప్పుకొచ్చాడు. ఇండియాతో తమ ఇద్దరికి ఉన్న అనుబంధం కారణంగా తమ కూతురుకు ఇండియా అనే పేరు పెట్టుకోవడం జరిగిందట.