Begin typing your search above and press return to search.

కొత్త జేమ్స్ బాండ్ ఎవరో తెలిసిపోయింది!!

By:  Tupaki Desk   |   8 Sep 2016 3:30 PM GMT
కొత్త జేమ్స్ బాండ్ ఎవరో తెలిసిపోయింది!!
X
జేమ్స్ బాండ్ అనగానే ఈ తరంలో టక్కున గుర్తొచ్చే వ్యక్తి డేనియల్ క్రెగ్. గత పదేళ్లుగా 007 పాత్రల్లో డేనియల్ బాగానే అలరించాడు. 2006లో విడుదలైన కేసినో రాయల్ నుంచి గతేడాది రిలీజ్ అయిన స్పెక్టర్ వరకూ.. మొత్తం నాలుగు సినిమాల్లో బ్రిటిష్ సీక్రెట్ ఏజంట్ గా కనిపించాడు. ఈ సిరీస్ లో నెక్ట్స్ రాబోయే చిత్రానికి మాత్రం తప్పుకోవాలని డిసైడ్ కావడంతో.. కొత్త జేమ్స్ బాండ్ ను వెతుక్కోవాల్సి వచ్చింది.

ఇప్పుడీ సీక్రెట్ ఏజంట్ రోల్ కు థోర్ మూవీలో సూపర్ హీరోగా నటించిన.. 'క్రిస్ హెమ్స్ వర్త్' ను ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డేనియల్ క్రెగ్ పాత్రలోకి క్రిస్ ను రీప్లేస్ చేయనున్నారని తెలుస్తోంది. ఇతనే కరెక్ట్ ఛాయిస్ అంటూ ఇప్పటికే డానియెల్ కూడా కితాబిచ్చేశాడు. క్రిస్ మాట్లాడే ఇంగ్లీష్ శ్లాంగ్.. ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చెప్పాడు. డేనియల్ తో కలిసి 3 జేమ్స్ బాండ్ సినిమాలకు పనిచేసిన స్టంట్ మ్యాన్ బాబీ హాలండ్ హాంటన్ కూడా క్రిస్ కే పూర్తి మార్కులు వేసేశాడు.

జేమ్స్ బాండ్ పాత్రకు పోటీ పడుతున్న టామ్ హిడిల్ స్టన్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నా.. క్రిస్ కే తాను ఓటు వేస్తానని.. అందుకు కారణం అతని పర్ఫెక్ట్ ఫిజిక్ అని చెప్పాడు ఈ స్టంట్ మ్యాన్. ఇయాన్ ప్రొడక్షన్స్ కూడా క్రిస్ హెమ్స్ వర్త్ వైపే మొగ్గుతుండడంతో.. త్వరలోనే నెక్ట్స్ జేమ్స్ బాండ్ మూవీ మొదలైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.