Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ని మోసం చేస్తే జనం ఊరుకోరు

By:  Tupaki Desk   |   4 Jun 2016 1:30 PM GMT
మెగాస్టార్ ని మోసం చేస్తే జనం ఊరుకోరు
X
మెగాస్టార్ చిరంజీవిని మోసం చేయడం అంటే.. అదేమీ చిన్న విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలో మెగా అన్నంతవరకూ ఓ హైపవర్ బ్రాండ్. దానికి మెగాస్టార్ బ్రాండ్ అంబాసిడర్. అలాంటి చిరును మోసం చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆఫ్ స్క్రీన్ సంగతులు ఏమో కానీ.. ఆన్ స్క్రీన్ పై కూడా చిరును మోసం చేస్తే జనం ఊరుకోరు అంటున్నాడు సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు.

డాడీ అనే టైటిల్ పై మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేశారు. ఫ్రెండ్స్ కి వాల్యూ ఇచ్చే ఓ రోల్, భార్యతో విబేధాలు, కన్న కూతురుతో సెంటిమెంట్ నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. అయితే.. ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీనికి కారణం తన మాటల్లో చెబుతున్నాడు చోటా కె నాయుడు. 'డాడీ మూవీ ఓ అద్భుతమైన కథ. ఫ్రెండ్ చేసే మోసానికి కుటుంబాన్ని కోల్పోయే వ్యక్తి కథ ఇది. కానీ ఇది జనాలకు నచ్చలేదు. ఇందుకు కారణం చిరంజీవి గారు మోసపోవడమేంటి అనే జనాల ఫీలింగే' అన్నాడు చోటా కె నాయుడు.

'చిరంజీవి అప్పటికి టాప్ రేంజ్ లో ఉన్న హీరో. అలాంటిది చిరంజీవి మోసపోవడమేంటి? జనాలు ఇలా ఫీల్ అయ్యారు. అసలు ఆయన్ని మోసం చేయడం అనే మాటనే వారు తట్టుకోలేకపోయారు. అందుకే ఆ సినిమా రిజల్ట్ తేడా పడింది' అంటున్నాడు చోటా కె. నాయుడు.