Begin typing your search above and press return to search.

టైగర్‌ స్పెషల్‌: లోన బైటా 'మామ'

By:  Tupaki Desk   |   26 Jun 2015 11:24 AM GMT
టైగర్‌ స్పెషల్‌: లోన బైటా మామ
X
హీరో సందీప్‌ గెలిచాడు. మామను నమ్మినందుకే ఈ గెలుపు. ఓ వైపు నిజజీవితంలో .. మరోవైపు తను నటించిన సినిమాలో తనకి 'మామ' కామన్‌ పాయింట్‌ కాబట్టి అతడికి ఈ గెలుపు దక్కింది. కథల ఎంపిక నుంచి ప్రతి విషయంలో జాగ్రత్త ఎలా తీసుకోవాలో దగ్గరుండి నేర్పిస్తున్నాడు చోటా (ఛాయాగ్రాహకుడు) మామ.

అందుకే అతడి జీవితంలోకి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ లాంటి అద్భుతమైన సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కొన్ని తప్పులు దొర్లాక మళ్లీ గాడిలోకి వచ్చాడు. ఈసారి తెలివిగా ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడినే లైన్‌లో పెట్టాడు. వి.ఐ.ఆనంద్‌ రూపంలో కథని సినిమాగా తీసే దర్శకుడు దొరికాడు. అంతేకాదండోయ్‌ ఈ సినిమా కథలో కూడా 'మామ' కీలకపాత్ర పోషించాడు. విజయంలోనూ కీలకమయ్యాడు. ఇందులో రాహుల్‌ రవీంద్రన్‌కి అద్భుతమైన ప్రేమకథ ఉంది. అదే టైగర్‌ సినిమాని గెలిపించింది. రాహుల్‌, సందీప్‌ ఇద్దరూ స్నేహితులు. సందీప్‌ తన ఫ్రెండుని మామ అని పిలుస్తాడు. అంటే తన ఫ్రెండులోనే ఛోటా మామని చూసుకున్నాడన్నమాట!

ఆ క్యారెక్టర్‌లో తనని మామ ఆవహించడం వల్ల బాగా నటించాడని అనుకోవాలి. ముఖ్యంగా టైగర్‌ సినిమాలో ఛోటా.కె.మామ కెమెరా పనితనం హైలైట్‌. ఛోటా లేని టైగర్‌ని ఊహించలేం. నిజం చెప్పాలంటే టైగర్‌ సినిమాకి టైగర్‌ పాత్ర ఎంత కీలకమో, సందీప్‌ ఎంత ముఖ్యమో, ఛోటా.కె కెమెరా కూడా అంతే ఇంపార్టెంట్‌. అలా లోన, బైట 'మామ' వల్లే సందీప్‌కి గెలుపు సాధ్యమైంది.