Begin typing your search above and press return to search.

85 కే‌జీలు తగ్గిన గణేశుడు

By:  Tupaki Desk   |   7 July 2017 12:08 PM IST
85 కే‌జీలు తగ్గిన గణేశుడు
X
మన దేశ సినిమాలుకు ప్రపంచ దేశాల సినిమాలుకు తేడా ఏంటి అంటే ఒకటే వాళ్ళ సినిమాలలో పాటలు ఉండవు మన సినిమాలలో పాటలు లేనిదే సినిమా ఉండదు. మనం మన పాటల్లో డాన్సులు లేనిదే మనకు సినిమా చూసినట్లే ఉండదు. అందుకే మన పాటలకు స్టెప్లు వేయించే కొరియోగ్రాఫర్లు బాగా ఫేమస్. ఇక ఈ మధ్యనే డిజె సినిమాలో అస్మయిక యోగ తస్మయిక బోగ అంటూ మత్తెక్కించే స్టెప్పులు వేయించిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్.. గణేశ్ ఆచార్య ఎలా ఉంటాడో మీకు తెలిసే ఉంటుంది. ఇద్దరు మనుషులు కలిస్తే ఉన్నంత సైజులో ఉంటాడు.

ఇంత భారీ శరీరం తో డాన్స్ ఎలా వేస్తాడు అబ్బా అని చాల మందికి అనుమానం కూడా వచ్చేది. కానీ అతనికి డాన్స్ అంటే పిచ్చి అభిమానం కాబట్టి తన బారీ శరీరంతోనే స్టార్లచే చిందులు వేయించి మనల్ని కూడా చిందులు వేసేలాగా చేశాడు. ఇప్పుడు అదే గణేశ్ ఆచార్య ను చేస్తే మీరు షాక్ అవ్వడం పక్కన పెట్టి.. లావుగా ఉన్నవారు అంతా వెంటనే జిమ్ జాయిన్ అయి బరువు తగ్గే పనిలో పడతారు. ఎందుకంటే గణేశ్ ఆచార్య ముందు 200 కే‌జిలు ఉంటే ఏడాదిన్నర కాలంలో 85 కే‌జిలు తగ్గి చూపించాడు. బొజ్జ వినాయకుడు లా ఉన్నవాడు హనుమంతుడులా తయారైడు. ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మారారు అని అడిగితే “ఎప్పుడో చేయవలిసిన పని ఇది. ఇప్పుడు చేశాను. జనాలు అంతా నన్ను లావు గా ఉన్న గణేశ్ గానే చూశారు. ఆ ఇమేజ్ ని మార్చుకోవాలి అనుకున్నా. చేశాను. అంతే” అని సులువుగా చెప్పేశాడు. కానీ ఒక ఏడాదిలో ఇన్ని కే‌జిలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇలా తగ్గి గణేశ్ చాలామందికి ఆదర్శంగా నిలిచాడు.

పాత హీరో గోవిందాకు చాలా పాటల్లో గణేశ్ ఆచార్యనే డాన్స్ కొంపోజ్ చేశాడు. కత్రినా కైఫ్ ‘చిక్ని చమేలీ’ కూడా గణేశే చేశాడు. బాజీరావ్ మస్తానీలో కూడా చాలా పాటలకు గణేషే కొరియోగ్రాఫర్. నేను బరువుగా ఉన్నప్పుడూ కూడా డాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేసి ఎనర్జిగా చేశాను. ఇప్పుడు ఇంకా డబుల్ ఎనర్జి తో డాన్స్ చేస్తాను.. అని ఆశాభావం తో చెబుతున్నాడు.