Begin typing your search above and press return to search.

వీడియో టాక్: చూసి చూడగానే ఛలో..

By:  Tupaki Desk   |   2 Dec 2017 4:36 PM GMT
వీడియో టాక్: చూసి చూడగానే ఛలో..
X
ఒక లవ్వర్ బాయ్.. ఒక క్యూట్ గాళ్‌.. ఒక మ్యూజిక్ మాంత్రికుడి కొడుకు.. ఈ ముగ్గురూ ఒకేసారి కలసి తమ సత్తా చాటితే ఎలా ఉంటుంది? అదిగో ''ఛలో'' సినిమాలోని పాటలా ఉంటుంది. కొత్త కుర్రాడు వెంకీ కుడుముల డైరక్షన్ లో నాగ శౌర్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు.. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ స్వరాలను సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ పాట ఇప్పుడు మ్యూజిక్ లవ్వర్లను తెగ ఆకట్టుకుంటోంది.

చూసి చూడంగానే నచ్చేశావే.. అంటూ సాగే ఈ పాట భలేగా ఉందనే చెప్పాలి. నాగ శౌర్య హీరోయిన్ రష్మిక మందన్నా ను అలా ఫాలో చేస్తుంటే.. వెనుకే వినిపిస్తున్న మదిని పులకరించే ఆ సాంగ్ కొత్త కొత్త భావాలను తట్టిలేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా హీరో హీరోయిన్ ఇద్దరూ తమ ఛార్మ్ తో అందరినీ పడేస్తున్నారు. పైగా పాటలోని విజువల్స్ మరియు సినిమాటోగ్రాఫీ కూడా చాలా బలంగా ఉన్నాయి. అందుకే ఈ సాంగ్ ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ తరహాలో అనిపిస్తోంది.

చాలా గ్యాప్ తీసుకుని చాలా ఛాలెంజింగ్ గా ఒక లవ్ కమ్ యాక్షన్ డ్రామాతో వస్తున్నాడు నాగ శౌర్య. ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకోవడంతో.. ఇప్పుడు పాటలో కూడా ఇలా ఇంప్రెస్ చేస్తుండటంతో.. మొత్తంగా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.