Begin typing your search above and press return to search.

చియాన్ 60 ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ కిల్ చేసిందిగా!

By:  Tupaki Desk   |   10 Jun 2020 1:00 PM IST
చియాన్ 60 ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ కిల్ చేసిందిగా!
X
చియాన్ విక్ర‌మ్ కెరీర్ లో 59 సినిమాలు పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం ల్యాండ్ మార్క్ 60వ సినిమాలో న‌టించ‌నున్నాడు. అయితే ఈ సినిమాకి మునుప‌టిలా కాకుండా చాలా ప్ర‌త్యేక‌త ఉంది. తాజా మూవీలో త‌న వార‌సుడు ధ్రువ్ తో క‌లిసి చియాన్ విక్ర‌మ్ న‌టించ‌నున్నాడు. కార్తీక్ సుబ్బ‌రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇటీవ‌లే చియాన్ 60 పోస్ట‌ర్ రిలీజైంది. ఆ పోస్ట‌ర్ ని మించి తాజాగా ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ వేడెక్కించేస్తోంది. తండ్రి-కొడుకు కాంబినేష‌న్ లుక్ ని హైలైట్ చేస్తూ ఓ అభిమాని ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ‌ని రిలీజ్ చేశాడు. పోస్టర్ ‌లో తండ్రి కొడుకుల లుక్ అల్టిమేట్ గా ఆక‌ట్టుకుంది. ఇరువురి మ‌ధ్యా.. తుపాకీ .. బుల్లెట్ పేలాక స్మాగ్.. గ్యాంగ్‌ స్టర్ టైటిల్ ‌తో ఎంతో ఆక‌ట్టుకుంది ఈ పోస్ట‌ర్.

ఒక ర‌కంగా ఇది హైప్ ‌ను పెంచే ప్ర‌య‌త్న‌మే. తండ్రి-కొడుకు ద్వయం ఫ్యాన్ మేడ్ పోస్టర్ పై ఏమనుకుంటున్నారు? అన్న‌ది అలా ఉంచితే దీనిపై ఫ్యాన్స్ నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోంది. ధ్రువ్ ఇంత‌కుముందు అర్జున్ రెడ్డి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆరంగేట్రం కొన్ని లోపాలున్నా రాణించే వీలుంద‌ని ఫ్యాన్స్ ప్ర‌శంసించారు. ఇప్పుడు చియాన్ తో జూనియ‌ర్ చియాన్ క‌లిసి న‌టిస్తున్నారు కాబ‌ట్టి చియాన్ 60పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. వ్వాట్ విల్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచ‌ర్! అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.