Begin typing your search above and press return to search.

చియాన్ వ‌ర్సెస్ చియాన్.. గ్యాంబ్లింగ్ మొద‌లెట్టారు

By:  Tupaki Desk   |   7 Dec 2020 1:30 AM GMT
చియాన్ వ‌ర్సెస్ చియాన్.. గ్యాంబ్లింగ్ మొద‌లెట్టారు
X
చియాన్ విక్ర‌మ్ కు హీరోగా తెలుగు- త‌మిళ భాష‌ల్లో మంచి పేరున్న విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా విక్ర‌మ్ అత‌ని క్రేజ్ కి త‌గ్గ స‌క్సెస్ రావ‌డం లేదు. కానీ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేస్తూనే వున్నాడు. ప్ర‌స్తుతం జ్ఞాన‌ముత్తు రూపందిస్తున్న `కోబ్రా` చి‌త్రంతో పాటు మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వ‌న్‌` చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి.

ఇదిలా వుంటే త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ ‌తో క‌లిసి విక్ర‌మ్ ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నారు. `అర్జున్ రెడ్డి` రీమేక్ ‌తో ధృవ్ వి‌క్ర‌మ్ త‌మిళ తెర‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. విక్రమ్.. ధృవ్ క‌లిసి న‌టించ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని కార్తీక్ సుబ్బ‌రాజు తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం కాబోతోంది.

విక్ర‌మ్ న‌టించ‌నున్న 60వ చిత్ర‌మి‌ది కావ‌డంతో చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో ఈ మూవీని కార్తీక్ సుబ్బ‌రాజు రెడీ చేస్తున్నార‌ట‌. ఫాద‌ర్ అండ్ స‌న్ క‌లిసి న‌టించ‌బోతున్న ఈ మూవీపై ఇప్ప‌టికే బారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే కార్తీక్ సుబ్బ‌రాజు ఈ మూవీని తెర‌కెక్కిచ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందులో చియాన్ వ‌ర్సెస్ జూనియ‌ర్ చియాన్ ఎపిసోడ్స్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని తాజా స‌మాచారం. ఇక‌ విక్ర‌మ్ న‌టిస్తున్న ప్ర‌యోగాత్మ‌క చిత్రం `కోబ్రా`పైనా భారీ బ‌జ్ క్రియేట్ అయింది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల్ని పెంచేసింది.