Begin typing your search above and press return to search.

విక్రమ్‌ మరోసారి మెస్మరైజ్ చేయబోతున్నాడట

By:  Tupaki Desk   |   10 Dec 2022 8:44 AM GMT
విక్రమ్‌ మరోసారి మెస్మరైజ్ చేయబోతున్నాడట
X
యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్ తన కెరీర్‌ లో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించడంతో పాటు... విభిన్నమైన గెటప్స్ తో అలరించాడు. కమల్ హాసన్ తర్వాత అత్యధిక విభిన్నమైన గెటప్స్ లో కనిపించిన స్టార్ చియాన్ విక్రమ్‌. విక్రమ్ గత చిత్రం కోబ్రా లో కూడా చాలా డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన విషయం తెల్సిందే.

విక్రమ్‌ సినిమా అంటే కొత్తదనంను జనాలు కోరుకుంటూ ఉంటారు. కనుక రంజిత్ పా దర్శకత్వంలో ప్రస్తుతం విక్రమ్‌ నటిస్తున్న సినిమా కూడా అదే స్టైల్ లో ఉండబోతుంది అంటూ తాజాగా విడుదల అయిన ఫొటోలను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. విక్రమ్‌.. రంజిత్ పా కాంబో మూవీ తంగలాన్ కోసం తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తంగలాన్ సినిమా కోసం విక్రమ్‌ ను పొడవాటి జుట్టు మరియు గడ్డం తో పాటు మొహం నల్ల రంగుతో మేకప్ చేశారు. ఈ సినిమా లో విక్రమ్‌ పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి.

విక్రమ్‌ తంగాలాన్‌ సినిమా వర్కింగ్‌ స్టిల్స్ సోషల్ మీడియా లో వైరల్‌ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కొన్ని సన్నివేశాల్లో విక్రమ్‌ ఈ లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

రంజిత్ పా విభిన్నమైన దర్శకుడు ఆయన దర్శకత్వంలో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకం ఈ స్టిల్స్ ని చూస్తుంటే అర్థం అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.