Begin typing your search above and press return to search.

'కోబ్రా' 25 గెట‌ప్పులు రివీల్ చేసేదెపుడు?

By:  Tupaki Desk   |   25 Dec 2019 1:28 PM GMT
కోబ్రా 25 గెట‌ప్పులు రివీల్ చేసేదెపుడు?
X
చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 58వ‌ చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఇందులో విక్ర‌మ్ ఏకంగా 25 విభిన్న‌మైన గెట‌ప్పుల్లో క‌నిపించ‌నున్నాడు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాకి చిత్ర‌యూనిట్ టైటిల్ ని ప్ర‌క‌టించింది.

కోబ్రా అనేది టైటిల్. తాజాగా టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ మోష‌న్ పోస్టర్ లో కోబ్రా (తాచు)ను ఎలివేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. కోబ్రా అంటే విషం చిమ్మే పాము. ఆ విషానికి ఎదురేలేదు... ప్రాణాంత‌కం! అనేది అర్థం. అంటే చియాన్ తో పెట్టుకుంటే కోబ్రాతో పెట్టుకున్న‌ట్టేన‌న్న‌మాట‌. థీమ్ బావుంది. మ‌రి సినిమాలో కంటెంట్ ఆ స్థాయిలోనే ఆక‌ట్టుకోనుందా? అన్న‌ది చూడాలి. వాస్త‌వానికి ఈ చిత్రానికి అమ‌ర్ అనే టైటిల్ వినిపించినా మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌నే కోబ్రాని ఎంపిక చేశార‌ట‌.

యువ ట్యాలెంట్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ల‌లిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీ‌నిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌టాన్ ఈ చిత్రంతో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. తెలుగు- త‌మిళం- హిందీలో పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. విక్ర‌మ్- శ్రీ‌నిధి జంట ఏ మేర‌కు మెప్పించ‌నున్నారు? చియాన్ 25 గెట‌ప్పుల క‌థేమిటి? అన్న‌ది రివీల్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమా త‌ర్వాత మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ లో చియాన్ విక్ర‌మ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.