Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: 'మహాన్' గా విక్రమ్‌ - ధృవ్‌ విక్రమ్..!

By:  Tupaki Desk   |   20 Aug 2021 2:33 PM GMT
ఫస్ట్ లుక్: మహాన్ గా విక్రమ్‌ - ధృవ్‌ విక్రమ్..!
X
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ - తనయుడు ధృవ్‌ విక్రమ్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ కెరీర్ లో వస్తున్న ఈ 60వ చిత్రానికి టైటిల్ ను ఖరారు చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

#Chiyaan60 చిత్రానికి ''మహాన్'' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విక్రమ్ ఓ బైక్ మీద కూర్చొని ఉన్నారు. లాంగ్ హెయిర్ తో ఉన్న విక్రమ్.. తలపై కొమ్ములు.. చుట్టూ చేతులతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. 'మహాన్' చిత్రంలో వాణి భోజన్ - సిమ్రాన్ - బాబీ సింహా - సనంత కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్ నటిస్తున్న 'కోబ్రా' సినిమా కూడా ఇదే బ్యానర్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ''మహాన్'' చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు - సంతోష్ నారాయణ్ కాంబోలో వస్తున్న 6వ సినిమా.

శ్రేయాస్ కృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ హర్షన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'మహాన్' చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని టాక్ నడుస్తోంది. ఇందులో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో ధృవ్ క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందని.. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయని అంటున్నారు. దీని కోసం ఇద్దరూ భారీ వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ లోకి వచ్చేసారు.

విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తండ్రీకొడుకులు విక్రమ్ - ధృవ్ విక్రమ్ నటిస్తున్న 'మహాన్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే దీని తర్వాత సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ ఓ సినిమా చేయనున్నాడు. మరోవైపు ప్రస్తుతం 'కోబ్రా' చిత్రంలో నటిస్తున్న విక్రమ్.. మణిరత్నం తో 'పొన్నియిన్ సెల్వన్' లో నటించనున్నారు.