Begin typing your search above and press return to search.

బ్యాక్ టు బ్యాక్ హీట్ పెంచుతున్న చియాన్ వార‌సుడు

By:  Tupaki Desk   |   14 Feb 2021 11:30 AM GMT
బ్యాక్ టు బ్యాక్ హీట్ పెంచుతున్న చియాన్ వార‌సుడు
X
చియాన్ విక్రమ్ న‌ట‌వార‌సుడు ధ్రువ్ విక్ర‌మ్ తొలి ప్ర‌య‌త్న‌మే న‌టుడిగా విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఆదిత్య వ‌ర్మ (అర్జున్ రెడ్డి రీమేక్‌) గా చ‌క్క‌ని హావ‌భావాల‌తో ఈ చాక్లెట్ బోయ్ ఆక‌ట్టుకున్నాడు. బాక్సాఫీస్ ఫ‌లితంతో సంబంధం లేకుండా న‌ట‌వార‌సుడు మెప్పించాడ‌న్న టాక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం అత‌డు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో హీట్ పెంచేస్తున్నాడు.

ప్ర‌స్తుతం పేట ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి త‌దుప‌రి చిత్రం షూటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాడు ధ్రువ్. గతేడాది తాను విక్రమ్ 60 వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నానని.. ఇది పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ అవుతుందని వెల్లడించడం ద్వారా పేట దర్శకుడు అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రాజెక్టులో కుమారుడు ధ్రువ్ తో పాటు విక్ర‌మ్ ప్ర‌ధాన పాత్రలో కనిపిస్తారు. విక్ర‌మ్ 60గా చెబుతున్న ఈ చిత్రం మార్చిలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మార్చి మొదటి వారంలో విక్రమ్ - ధ్రువ్ ఈ చిత్ర సెట్స్‌లో చేరనున్నారు. విక్రమ్ ఈ నెల చివరి నాటికి మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ పూర్తి చేసి కార్తీక్ సుబ్బరాజ్ చిత్రానికి సంబంధించిన పనులను ప్రారంభిస్తాడు.

గ్యాంగ్‌స్టర్ డ్రామాగా చెబుతున్న‌ ఇందులో ప్రధాన భాగం మదురై- చెన్నైలలో చిత్రీకరిస్తారు. మొత్తం తారాగణం - సిబ్బందికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ స్క్రిప్టింగ్ చివరి దశలోనే ఉన్నారని తెలిసింది.

ఇదిలా ఉండ‌గానే ధ్రువ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయ‌నున్నాడు. తాజాగా మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ కి ధృవ్ విక్ర‌మ్ ఓకే చెప్పాడ‌ని తెలిసింది. ఈ మూవీ కోసం ధృవ్ ప్రస్తుతం కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం ట్రై చేస్తున్నార‌ట‌. లుక్ ఛేంజ్ కోసం వ్య‌క్తిగ‌త ట్రైన‌ర్ స‌మ‌క్షంలో ఫామ్ హౌస్ లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ ల‌వ్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్ క‌థానాయిక అని కూడా తెలిసింది.