Begin typing your search above and press return to search.

కిట్టిగా మారిన రంగస్థలం చిట్టిబాబు

By:  Tupaki Desk   |   27 Jun 2019 10:51 AM IST
కిట్టిగా మారిన రంగస్థలం చిట్టిబాబు
X
గత ఏడాది విడుదలై అనూహ్యంగా ఇండస్ట్రీ హిట్ సాధించి చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న రంగస్థలం కన్నడ భాషలోకి వెళ్తోంది. డబ్బింగ్ తో సహా ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెల రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆడియో హిట్ కాగా నిన్న వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రచ్చ చేసిన రామ్ చరణ్ కన్నడలో కిట్టిగా పేరు మార్చుకున్నాడు.

ఈ పాత్రను పరిచయం చేస్తూ వదిలిన టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కన్నడలో దశాబ్దాలుగా ఉన్న డబ్బింగ్ ఆంక్షలను ఇటీవలే ఎత్తేసిన సంగతి తెలిసిందే. అందుకే సౌత్ లో రూపొందుతున్న క్రేజీ సినిమాలన్నీ అక్కడ డబ్ అవుతూ నిర్మాతలకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న రంగస్థలకు సైతం మంచి ఆదరణ దక్కుతుందని భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

గ్రామీణ భౌగోళిక ప్రాంతం ఎక్కువగా ఉండే కర్ణాటకలో దీనికి మంచి స్పందన దక్కుతుందని అంచనాలు ఉన్నాయి. పైగా మెగా ఫాన్స్ బేస్ ఎక్కువగా ఉండే కన్నడ రాష్ట్రంలో స్వంత భాషలో రామ్ చరణ్ సినిమా వస్తోంది అంటే రచ్చ మాములుగా ఉండదు. అందుకే హైప్ కూడా దానికి తగ్గట్టే ఉంది. ఇప్పటికే ఆన్ లైన్ స్ట్రీమింగ్-శాటిలైట్ ఛానల్స్ ద్వారా విరివిగా ప్రసారమైన తెలుగు రంగస్థలంను కన్నడ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి