Begin typing your search above and press return to search.

తేజుకి పోటీగా మిల్కీ దెయ్యం

By:  Tupaki Desk   |   10 March 2019 5:30 PM GMT
తేజుకి పోటీగా మిల్కీ దెయ్యం
X
ఆరు వరస డిజాస్టర్లతో బాగా దెబ్బ తిని ఉన్న సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కు అర్జెంట్ గా మాములు హిట్ కాదు ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ పడాలి . అందుకే ఆశలన్నీ చిత్రలహరి మీదే పెట్టుకున్నాడు. తేజ్ ఐ లవ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ మెగా హీరో కథ డిమాండ్ మేరకు బాగా ఒత్తైన గుబురు గెడ్డం పెంచి లుక్ ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇది ఏప్రిల్ 12న విడుదల కానుంది. అధికారికంగా మరోసారి ప్రకటించాక క్లారిటీ వస్తుంది.

ఏప్రిల్ మొదటివారం నుంచి వస్తున్న తెలుగు స్ట్రెయిట్ మూవీస్ అన్ని పక్కా ప్లానింగ్ పోటీ లేకుండా సేఫ్ గేమ్ తో బరిలో దిగుతున్నాయి. ఈ ట్రెండ్ ఆపై నెల కూడా కొనసాగనుంది. ఈ కారణంగానే మజిలి జెర్సీ క్లాష్ కావలసిన అనివార్య పరిస్థితిని రెండోది వాయిదా వేయడం ద్వారా తప్పించారు. దానివల్లే మజిలి 5న జెర్సీ 19న సోలోగా వస్తున్నాయి

చిత్రలహరి టార్గెట్ చేసిన 12కు సైతం ఏ పోటీ లేదు. కాని అనూహ్యంగా ఇప్పుడు తమన్నా ప్రభుదేవాల దేవి 2 అదే డేట్ లాక్ చేసుకుంది. నిన్న సాయంత్రం పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. దీని మొదటి పార్ట్ తెలుగులో అభినేత్రిగా డబ్ అయ్యి ఇక్కడా మంచి సక్సెస్ దక్కించుకుంది. దాని సీక్వెలే ఇది. అభినేత్రి 2గా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాని ఇంకా హక్కులు కొన్న నిర్మాత ఎవరో తెలియదు.

సక్సెస్ అయిన మూవీ సీక్వెల్ కాబట్టి అంతో ఇంతో బజ్ అయితే వస్తుంది. చిత్రలహరికి దీనికి జానర్ పరంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ తమ హీరో సోలోగా వస్తాడు అని ఎదురు చూస్తున్న తేజు ఫ్యాన్స్ కు ఇది ఒకరకంగా చిన్న షాక్ లాంటిది. అయినా కంటెంట్ ఉంటే పోటీలో ఏది ఉన్నా లెక్క చేయాల్సిన అవసరం లేదు కాని తేజు ఉన్న పరిస్థితికి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా భూతద్దంలో చూడాల్సి వస్తోంది