Begin typing your search above and press return to search.

పండగ రోజు చిత్రలహరి సందడి ?

By:  Tupaki Desk   |   4 April 2019 12:30 PM GMT
పండగ రోజు చిత్రలహరి సందడి ?
X
సుప్రీమ్ హీరోగా ఐదు సినిమాలు పూర్తి కాకుండానే ఇరవై కోట్ల మార్కెట్ కు చేరుకున్న సాయి ధరం తేజ్ కు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా వరసగా ఆరు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ పలకరించడంతో డిఫెన్స్ పడ్డ మాట వాస్తవం. అందుకే కోరి మరీ కొంత గ్యాప్ తీసుకుని నిజమైన గెడ్డం పెంచి చిత్రలహరి కోసం రెడీ అయ్యాడు. ఫ్లోప్స్ వల్ల మార్కెట్ ఎంత డ్యామేజ్ అయ్యిందంటే హీరొయిన్ల కొరతతో పెద్దగా డిమాండ్ లేని కళ్యాణి ప్రియదర్శన్ నివేత పెతురాజ్ లతో సర్దుకోవలసి వచ్చింది.

ఒక్క హిట్టు పడితే ఇవన్ని సర్దుకుంటాయి కాని అదే ఎప్పుడు అనేది ప్రశ్నగా మారింది. అందుకే చిత్రలహరి మీద మనోడు పెట్టుకున్న అంచనాలు మాములుగా లేవు. ఈ నెల 12 విడుదల ఇంతకు ముందే చెప్పేశారు కాబట్టి అందులో మార్పు ఉండకపోవచ్చు .మరి పది రోజుల్లో విడుదల ఉండగా ప్రమోషన్ పరంగా ఎలాంటి హడావిడి అయితే బయట కనిపించడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ నెల 6న అంటే ఉగాది పండగ రోజు చిత్రలహరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట.

జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తాడనే ప్రచారం జరిగింది కాని ఖచ్చితంగా వచ్చేది లేనిది తెలియదు. ఎలాగూ ఆర్ఆర్ఆర్ కు మూడు వారాలు బ్రేక్ దొరికింది కాబట్టి తారక్ అందుబాటులోనే ఉన్నాడు కాని రాజకీయంగా వాతావరణం వేడిగా ఉన్న తరుణంలో పబ్లిక్ ఫంక్షన్స్ కు వస్తాడా అనేది అనుమానమే. ఇప్పుడీ పండగ రోజు ప్రీ రిలీజ్ న్యూస్ నిజమే అయితే కాస్త త్వరపడి పబ్లిక్ కి గట్టిగా తెలిసేలా చేయడం అవసరం.