Begin typing your search above and press return to search.

ఆ ఇంట్లో మెగా అల్లుడు స్వీయ నిర్భంధం

By:  Tupaki Desk   |   2 July 2020 9:30 AM IST
ఆ ఇంట్లో మెగా అల్లుడు స్వీయ నిర్భంధం
X
ఇది మ‌హ‌మ్మారీ సీజ‌న్. అంతకంత‌కు విజృంభిస్తోంది. అయితే వైర‌స్ కి కొంద‌రు భ‌య‌ప‌డుతుంటే మ‌రికొంద‌రు మాత్రం తెగించి సెట్స్ కి వెళుతున్నారు. అలా వెళ్లిన వాళ్లంతా ఇప్పుడు స్వీయ‌నిర్భంధ‌న నియ‌మాన్ని క‌ఠినంగా పాఠిస్తున్నారు. కొవిడ్ 19 ఇంట్లో వాళ్ల‌కు చుట్టుకోకుండా ఉండాలంటే ఆ మాత్రం నిబంధ‌న త‌ప్ప‌నిస‌రి అని భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ రెండవ చిత్రం `సూపర్ మ‌చ్చి` సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభించిన అతికొద్ది తెలుగు సినిమాల్లో ఇది ఒకటి. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. కొన్ని రోజుల టాకీ పార్ట్ స‌హా ఒక పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేయాల్సి ఉంది.

తాజాగా కళ్యాణ్ దేవ్ ఓ ఇంట‌ర్వ్యూలో ముచ్చ‌టిస్తూ.. త‌న స్వీయ నిర్భంధ‌న నియ‌మం గురించి తెలిపాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి త‌మ‌ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ ‌లో సెల్ఫ్ దిగ్బంధం చేస్తున్నట్లు వెల్లడించాడు. తన భార్య శ్రీజా .. కుమార్తెలను ప్రమాదంలో పడేయ‌డం త‌న‌కు ఎంత‌మాత్రం ఇష్టం లేదు. అందుకే అదే ఇంట్లో విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నామ‌ని కల్యాణ్ దేవ్ తెలిపారు.

అంతేకాదు.. కల్యాణ్ తన భార్య పిల్లలతో ఫేస్ టైమ్ ద్వారా మాట్లాడుతున్నాన‌ని వెల్లడించాడు. బట్టలు ఉతకడం.. వంట చేయడం స‌హా తన సొంత పనులను తానే చేసుకుంటున్నాడ‌ట‌.