Begin typing your search above and press return to search.
జగన్ తో చిరు స్పెషల్ మీటింగ్... ?
By: Tupaki Desk | 10 Oct 2021 8:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఇపుడు టాలీవుడ్ కి పెద్దగా ఉన్నారు. కొందరు ఒప్పుకున్నా కాదన్నా కూడా ఆయనే మొత్తం సినిమా రంగం సమస్యల మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే చిరంజీవి రెండు రాష్ట్రాల సీఎంలకు ఆదరణపాత్రుడు కావడం. నిజానికి టాలీవుడ్ లో చాలా మందికి ఇద్దరు సీఎంలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. కొందరికైతే స్నేహం, దాన్ని మించిన బంధుత్వం కూడా ఉందని చెప్పుకుంటారు. సరే ఎవరు ఏ చానల్ లో వచ్చినా కూడా సినీ రంగ సమస్యలు అంటే మాత్రం మెగాస్టార్ నే ఇద్దరు సీఎంలు పిలవడం ఇప్పటిదాకా జరిగిన తంతు. అందరూ చూసింది కూడా అదే.
ఇవన్నీ పక్కన పెడితే ఒక వైపు మా ఎన్నికలు హీట్ వాతావరణాన్ని టాలీవుడ్ లో క్రియేట్ చేశాయి. ఏపీ ప్రభుత్వం వద్ద టాలీవుడ్ కి సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి కోసం టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్ తో మీట్ కావాలని ఆ మధ్యన అనుకున్నారు. ఇంతలో రిపబ్లిక్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని హాట్ కామెంట్స్ కొంత ఇబ్బందిగా మారాయి. దానికి ప్యాచప్ చేసి నార్మల్ సిట్యువేషన్ని తీసుకురావాలనుకుంటున్న నేపధ్యంలో మా ఎలక్షన్స్ మరోసారి మంటలు రేపాయి.
ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తో మంచు విష్ణు ప్యానల్ రంగంలో ఉండడం, ఆయన జగన్ కి బంధువు కావడంతో చివరికి అది అటూ ఇటూ తిరిగి వైసీపీ వర్సెస్ మెగా కాంపౌండ్ అన్నట్లుగా సీన్ మారిపోయేలా ఉందని కూడా అంటున్నారుట. అయితే దాని మీద ఎవరికి వారు సర్దుకున్నా కూడా మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ ఇవ్వడం, దాని మీద మోహన్ బాబు హర్ట్ కావడం వంటివి చూసినపుడు ఈ ఎన్నికలు ఎంత కాదనుకున్నా రాజకీయ రంగును పులిమాయి అంటున్నారు. దీంతో ఈ ఎన్నికల రచ్చకు చిరంజీవి దూరంగానే ఉంటున్నారుట.
ఎవరు గెలిచినా కూడా ఆయన సినీ పెద్దగానే ఉంటూ పరిశ్రమలోని సమస్యల సాధనకు కృషి చేస్తారు అంటున్నారు. అదే సమయంలో తాను ఫలానా వారికి వ్యతిరేకమనే భావనకు కూడా కలగనీయకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారని చెబుతున్నారు. ఇక మా ఎన్నికల తతంగం ముగిశాక చిరంజీవి జగన్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారు అన్న టాక్ అయితే వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీ పెద్దలతో సీఎం మీటింగునకు ఇది ముందస్తు భేటీ అంటున్నారు. మరి జగన్ తో చిరంజీవి స్పెషల్ మీటింగ్ జరుగుతుందా, జరిగితే ఏం మాట్లాడుతారు అనంది ఇపుడు సరికొత్త చర్చగా ఉంది. ఏది ఏమైనా మా ఎన్నికల తరువాత కూడా టాలీవుడ్ లో చాలా పరిణామాలు జరుగుతాయనే అంటున్నారు. వాటి కోసం వెయిట్ చేయాల్సిందే.