Begin typing your search above and press return to search.
152వ మూవీకి సైరా అంటున్న చిరంజీవి
By: Tupaki Desk | 7 Oct 2019 8:00 PM ISTసైరా హిట్ టాక్ తో రన్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు చిరంజీవి, రాంచరణ్. ఇంకొన్ని రోజుల్లో చిరు తన 152 మూవీ సెట్ చేయబోతున్నారు. ఆల్రెడీ చిరు దర్శకుడు కొరటాల శివ చెప్పిన స్టోరీ ఓకే చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం కొత్తగా ఆఫీస్ కూడా తీసుకున్నారు. దసరా సందర్భంగా చిరంజీవి 152వ సినిమాకి పూజ కార్యక్రమాలు జరగన్నాయి. ఆ తర్వాత షూటింగ్ ఎప్పుడు మొదలుకాబోతుంది అన్నది ఇంకా తెలీలేదు. సైరా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిరంజీవి కొద్దీ రోజులు రెస్ట్ తీసుకుని రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తారని తెలుస్తుంది.
ఎలాంటి అంచనాలు లేకుండా అనూహ్యంగా డైరెక్టర్ అయిన కొరటాల శివ ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ గా నిలిచాయి. అతని సినిమాలలో సొసైటీకి ఏదొక మెసేజ్ ఇవ్వడం కొరటాల శివ స్టైల్. ఇప్పుడు చిరంజీవికి కూడా అలాంటి మెసేజ్ ఓరియంట్ సినిమానే చెప్పి ఒప్పించినట్టు సమాచారం. సినిమాలో ఉన్న మెసేజ్ ని కూడా కమర్షియల్ యాంగిల్ లో చెప్పడంలో శివని కొట్టేవారు లేరు. ఈ సినిమాకి నిర్మాతలుగా రాంచరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.