Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారుతో భేటీకి ముందు చిరు అలా ఎందుకు మాట్లాడారు?
By: Tupaki Desk | 20 Sept 2021 11:00 AM ISTసెకండ్ వేవ్ కరోనా చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. అన్నింటికి మించి సినిమా ఇండస్ట్రీకి తగిలిన దెబ్బ మరింత బలంగా తగిలిందని చెప్పాలి. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ షాక్ ఇండస్ట్రీని ఇంకా విడిచి పెట్టలేని పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్రనటుడి సినిమా పూర్తి అయ్యాక కూడా విడుదల గురించి ఆలోచిస్తున్నారంటే.. ఎలాంటి పిరిస్థితి ఉందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలుగు సినిమా రంగానికి చెందిన పెద్దలు ఈ రోజు ఏపీ సర్కారుతో భేటీ కానుండటం తెలిసిందే. తమ భేటీకి కొన్ని గంటల ముందు లవ్ స్టోరీ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు.. దాని తీవ్రతను తెలియజేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. అవసరం కోసం అడుగుతున్నామన్న కీలక వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న మాటతో పాటు.. ఆదేశాలు జారీ చేయాలన్న మాట ఆయన నోటి నుంచి రావటం చూస్తే.. చిరు ఉత్తినే ఈ వ్యాఖ్యలన్ని చేయలేదన్న మాట వినిపిస్తోంది.
తెలుగు సినిమా రంగానికి చెందిన నిర్మాతలు.. నటీనటులు.. డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ యజమానులు ఏపీ సర్కారు భేటీకి హాజరు కానున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ భేటీకి ఏపీ మంత్రి పేర్ని నాని నేత్రత్వంలో జరగనుంది. మెరిసేదంతా బంగారం కాదనే విషయాన్ని ప్రభుత్వానికి స్పష్టం చేయటం ద్వారా.. ఇండస్ట్రీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న విషయాన్ని చెప్పేశారు.
సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉందంటే అందరూ బాగున్నారని కాదనే సంగతిని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్న ఆయన.. కేవలం ఐదారుగురు హీరోలు.. ఐదారు మంది నిర్మాతలే తప్పించి మొత్తం సినీ ఇండస్ట్రీ కానే కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు. హీరోలు భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారనేది కొంతమందే ఉంటారని.. డైరెక్టర్లు బాగా సంపాదిస్తున్నారన్నది కూడా వేళ్ల మీద లెక్కబెట్టొచ్చన్నారు. ఆశగా అడగట్లేదు.. అవసరం కోసం అడుగుతున్నాం.. పరిస్థితిని అర్థం చేసుకోండి.. కనికరించండి అన్న మాటల్ని చూస్తే.. తమ భేటీ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని.. అనంతరం నిర్ణయాల్ని కూడా వెంటనే వెల్లడించాలన్న అంశం ఇమిడి ఉందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.