Begin typing your search above and press return to search.
ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ కి పూనకాలే..!
By: Tupaki Desk | 7 May 2020 8:00 AM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీతో స్పీడ్ పెంచేసాడు. ఖైదీ నంబర్150 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు తరువాత పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డిలో నటించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాలను వరుసగా లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా తరువాత మరోసారి పాన్ ఇండియా లెవల్‌లో ఓ భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట. ఇండియన్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్ శంకర్ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు చిరు రెడీ అవుతున్నట్టుగా సమాచారం.
శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ విడుదలైనప్పటి నుంచి చిరు.. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమానైనా చేయాలనే కోరిక కోరికతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే ‘జెంటిల్‌మెన్’ సినిమాను హిందీలో చిరంజీవి.. మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా 'ది జెంటిల్మెన్’ టైటిల్ తో రీమేక్ చేసారు. ఈ సినిమా హిందీలో డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం కోసం మెగాస్టార్ వేచి చూస్తూనే ఉన్నాడట. తాజా సమాచారం ప్రకారం.. శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక మెసెజ్ ఓరియండెట్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు టాక్. ఇక ప్రస్తుతం శంకర్.. కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా కరోనాతో పాటు అంతకు ముందు సెట్‌లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కే అవకాశం ఉందట. మరి వీళ్లిద్దరి కలయికలో సినిమా అంటే ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ వార్త మెగాస్టార్ ఫ్యాన్స్ లో పండగ వాతావరణం తీసుకొచ్చిందని చెప్పొచ్చు.