Begin typing your search above and press return to search.

చిరు మూవీ అప్డేట్ ఇచ్చిన శృతి హాసన్‌

By:  Tupaki Desk   |   19 April 2022 4:28 AM GMT
చిరు మూవీ అప్డేట్ ఇచ్చిన శృతి హాసన్‌
X
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన సినిమాల్లో ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ జరుగుతుంది అనేది క్లారిటీ లేకుండా ఉంది. నిన్న మొన్నటి వరకు గాడ్‌ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న చిరంజీవి ఆ తర్వాత భోళా శంకర్‌ సినిమా చిత్రీకరణ కూడా జరిగింది.

చిరు చేస్తున్న మూడు సినిమాల్లో ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో అస్సలు స్పష్టత లేకుండా పోయింది. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లుగా శృతి హాసన్ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం తాను మెగా 154 షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లుగా ప్రకటించింది.

బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను కన్ఫర్మ్‌ చేశారు అనే వార్తలు వచ్చాయి. కాని టైటిల్‌ విషయంలో మళ్లీ ఆలోచనలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమె గతంలోనే చిరంజీవి తో కలిసి షూటింగ్‌ లో పాల్గొంది. ఇప్పుడు ఆమె మరో షెడ్యూల్‌ కు సిద్దం అయ్యింది.

ఒక వైపు ఆచార్య సినిమా షూటింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూనే చిరంజీవి మరో వైపు బాబీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి లుక్ చాలా విభిన్నంగా ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. శృతి హాసన్ తో మొదటి సారి చిరంజీవి రొమాన్స్ కు సిద్దం అయ్యాడు. చాలా విభిన్నంగా ఉంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.

ఇక శృతి హాసన్ విషయానికి వస్తే.. కరోనా మరియు ప్రియుడు శాంతను ఇంట వేడుకల కారణంగా గత కొన్నాళ్లుగా షూటింగ్ లకు శృతి హాసన్ దూరంగా ఉన్న విషయం తెల్సిందే. ఆమె మళ్లీ ఇన్నాళ్లకు షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్న నేపథ్యంలో వరుసగా ఆమె సినిమా ల షూటింగ్ లతో బిజీ అవ్వబోతుంది. చిరంజీవి తో సినిమా తర్వాత వెంటనే బాలయ్య.. గోపీచంద్‌ మలినేని కాంబో సినిమా లో కూడా ఆమె నటించబోతుంది.

మరో వైపు సలార్‌ షూటింగ్‌ లో కూడా ఆమె పాల్గొనబోతుంది. మొత్తానికి రెండు నెలల పాటు బిజీ బిజీగా శృతి హాసన్‌ షూటింగ్‌ ల్లో గడపబోతుంది. ఈమె బాలీవుడ్‌ సినిమాలకు కూడా కమిట్‌ అయ్యింది. తమిళ సినిమాల్లో కూడా ఈమె ఇప్పటికే నటిస్తున్న విషయం తెల్సిందే.