Begin typing your search above and press return to search.

మెగాస్టార్ అలాంటి మిస్టేక్ చేయకుండా కేర్ తీసుకుంటున్నాడా..?

By:  Tupaki Desk   |   14 April 2020 5:30 PM GMT
మెగాస్టార్ అలాంటి మిస్టేక్ చేయకుండా కేర్ తీసుకుంటున్నాడా..?
X
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రీమేక్ ల పరంపర కొనసాగుతోందని చెప్పవచ్చు. మన సౌత్ ఇండియా సినిమాల కోసం బాలీవుడ్ కాచుకొని కూర్చొని ఉంటే అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను మన వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. అలానే ఇతర ఇండస్ట్రీలలో హిట్ చిత్రాలను కొనుక్కొని టాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేస్తుండగా, మన తెలుగు సినిమాలను ఇతర బాషలలో రీమేక్ చేస్తూ వస్తున్నారు. ఇలా సినిమాలను రీమేక్ చేయడమనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.. ఎప్పటి నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నదే. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడమంటే అంత సులభమైన పనికాదు. కథలో అసలు విషయం దారి తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా తీయాలి. అవసరమైతే ప్రాంతీయతకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాలి. మన టాలీవుడ్ విషయానికొస్తే రీమేక్ చిత్రాలను చాలా లైట్ తీసుకుంటారనే అపవాదు ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఇతర భాషల్లో ఎంత సూపర్ హిట్ సినిమా అయినా మన తెలుగులో మాత్రం ఒక ఆర్డినరీ డైరెక్టర్ లేదా ఒక ప్లాప్ డైరెక్టర్ చేతిలో పెడుతూ ఉంటారు. అదే సినిమా యదావిధిగా తీసినప్పటికీ పరాజయం చవి చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే టాలీవుడ్ లో రీమేక్ అయిన చిత్రాల్లో విజయం సాధించిన చిత్రాల కంటే పరాజయం పొందిన సినిమాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి అలాంటి మిస్టేక్ చేయకుండా జాగ్రతలు తీసుకుంటున్నాడట.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ తరపున రామ్ చరణ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మలయాళ రీమేక్ లో నటించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు ఏ డైరెక్టర్ కి అప్పగించనున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా ఇప్పుడు లేటెస్టుగా 'లూసిఫర్' సినిమా రీమేక్ కి దర్శకత్వం వహించే అవకాశం యంగ్ డైరెక్టర్ సుజిత్ కి అప్పగించినట్లు సమాచారం. అయితే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన సుజీత్.. శర్వానంద్ 'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. టిపికల్ స్క్రీన్ ప్లేతో తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగాడు కానీ కమెర్షియల్ గా పెద్దగా చెప్పుకొనే చిత్రంగా నిలబడలేదు. అంతేకాకుండా ప్రభాస్ తో తీసిన 'సాహో' సినిమా హిందీలో విజయం సాధించినప్పటికీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదని చెప్పవచ్చు.

దీంతో మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ స్కిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. దీని కోసం ఈ స్క్రిప్ట్ తెలుగు వెర్షన్ రెడీ చేసే బాధ్యతను డైరెక్టర్ సుకుమార్ చేతిలో పెట్టాడట మెగాస్టార్. సుక్కు ఈ స్టోరీలో ఏమి మార్పులు చేర్పులు చేస్తాడో చూడాలి. అంటే ఇప్పుడు సుక్కు రెడీ చేసిన ఆ స్కిప్ట్ ని సుజీత్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన కెరీర్లో 152వ చిత్రం 'ఆచార్య'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన అనంతరం ఈ ఏడాది చివర్లో సుజీత్ డైరెక్షన్లో 'లూసిఫర్' తెలుగు రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాకు రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.