Begin typing your search above and press return to search.
లాక్ డౌన్..రానాకి వెడ్డింగ్ లాక్: మెగాస్టార్ ట్వీట్
By: Tupaki Desk | 12 May 2020 8:42 PM ISTటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి. అతి కొద్దిరోజులలో పెళ్ళికొడుకు కాబోతున్నాడని అర్ధమవుతుంది. ఆరడుగుల పైనే ఎత్తు.. హాలీవుడ్ హీరో స్ట్రక్చర్ తో పాటు రానా నటనకు లేడీ ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు. ఈ మధ్య రానా ఎక్కడికి వెళ్లినా ప్రతీ ఒక్కరూ పెళ్లి గురించే అడుగుతున్నారు. ఇక పై పెళ్లి ఎప్పుడు అనే విషయం పై క్లారిటీ ఇవ్వనున్నాడు రానా. ఇదివరకు పెళ్లితో పాటు గర్ల్ ఫ్రెండ్ ఎవరని కూడా అడిగేవారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ రానా ఈరోజే సమాధానం ఇచ్చేసాడు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నానంటూ.. సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు. ఇక తన గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్తూ.. తన పేరు మిహీకా బజాజ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేశాడు రానా. అంతేగాక మిహీకాతో దిగిన సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేస్తూ.. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. అయితే పెళ్లి డేట్, ఎంగేజ్‌మెంట్ లాంటి విషయాలను మాత్రం సీక్రెట్ గా దాచాడు. కేవలం తనకు లైఫ్ పార్ట్‌నర్ ఎస్ చెప్పిందని మాత్రమే తెలిపాడు.
ఇక తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్.. డ్యూ డ్రాప్ అనే ఈవెంట్ కంపెనీని ముంబైలో రన్ చేస్తుందట. ముంబైలోని స్టార్ల ఫ్యామిలీ ఈవెంట్లను ఈ కంపెనీ డిజైన్ చేస్తుందట. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై చాలా మక్కువ కలిగిందని తెలుస్తుంది. ఇక రానా పోస్ట్ పై మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు. చిరు ట్వీట్ చేస్తూ.. "కంగ్రాట్స్ మై బాయ్.. అరివీర భల్లాలదేవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్నమాట. ఈ లాక్ డౌన్ ఓ రకంగా మంచే చేసింది నీకు వెడ్డింగ్ లక్ తీసుకొచ్చింది. గాడ్ బ్లెస్ యు. శతమానం భవతి" అంటూ ట్వీట్ చేశారు. చిరు స్పందనతో సెలబ్రిటీలంతా రానాను విష్ చేస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ - రానాలు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే చోట కలిసి చదువుకున్నారు కూడా.. ఇక చిరంజీవి కూడా రానాను తన కొడుకులాగే ట్రీట్ చేస్తారు. ప్రస్తుతం రానా ఇంటివాడు అవుతుండటంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో ఆనందం మొదలయ్యిందని తెలుస్తుంది. మెగాస్టార్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరూ రానాకి విషెస్ తెలుపుతున్నారు.