Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' ప్రొడ్యూసర్ గా మెగాస్టార్ ఉండేవాడా...?

By:  Tupaki Desk   |   15 April 2020 4:00 PM IST
ఆర్.ఆర్.ఆర్ ప్రొడ్యూసర్ గా మెగాస్టార్ ఉండేవాడా...?
X
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్. ఎస్. రాజమౌళి ఒకరు. పేరులోనే సక్సెస్ చేర్చుకున్న రాజమౌళి ఇప్పటి వరకు తీసిన అన్ని చిత్రాలు సక్సెస్ సాధించగా.. పరాజయమనేది తెలియకుండా విజయ పథంలో దూసుకెళ్తున్నారు. ఇక రాజమౌళి సినిమాలకు యావత్ సినీ అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుండి సినిమా వస్తుందంటే రికార్డ్స్ గురించి మాట్లాడుకోవలసిందే.. హిట్ అండ్ ప్లాప్ అనే మాటలు పక్కన పెట్టేస్తారు అంతే. సినిమాలను ఆ రేంజ్ లో తీర్చి దిద్దుతాడు కాబట్టే ఆయన్ని జక్కన్న గా మార్చేశారు సినీ అభిమానులు. ఆయనతో సినిమా తీయడానికి నిర్మాతలు ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. ఒక చిత్రం చిత్రీకరణ దశలో ఉండగానే కొత్త చిత్రం కోసం ఆయనకు అడ్వాన్సులు ఇస్తుంటారు. దర్శకుడిగా రాజమౌళికి అంత డిమాండ్ ఉంది. రాజమౌళి తో సినిమా ఓకే చేసుకున్న నిర్మాతలు ధైర్యంగా గుండెల మీద చెయ్యేసుకొని నిద్ర పోతారు. అది రాజమౌళిపై ప్రొడ్యూసర్స్ కి ఉండే నమ్మకం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ ఆర్ ఆర్' కి నిర్మాతగా డీవీవీ దానయ్య వ్యవహరిస్తున్నారు.

రాజమౌళికి చాలా ఏళ్ల క్రితమే డీవీవీ దానయ్య ఓ మూవీ కోసం అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇచ్చిన కమిట్మెంట్ తోనే 'ఆర్ ఆర్ ఆర్' డీవీవీ దానయ్య నిర్మాణంలో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీకి నిర్మాతగా ముందు మెగాస్టార్ చిరంజీవి ఉండాలని భావించారట. రాజమౌళితో ఈ విషయంపై చిరంజీవి చర్చించారట కూడా. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం రీత్యా రాజమౌళి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అంటే దానయ్యకి రాజమౌళి కమిట్మెంట్ ఇవ్వకుంటే ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి మెగాస్టార్ మెగా ప్రొడ్యూసర్ గా వ్యవరించేవాడన్న మాట. అలాగే 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ తనకు ఇచ్చేయమని భారీ అమౌంట్ ని దానయ్యకు ఆఫర్ చేశారట. కానీ దానయ్య ఆ ఆఫర్ ని తీసుకుకోకుండా తానే నిర్మించడానికి పూనుకున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు డీవీవీ దానయ్య. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇండియాలోని దాదాపు ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా బాహుబలి లాంటి అద్భుతమైన సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా తర్వాత బడా నిర్మాత కేయల్ నారాయణతో రాజమౌళి నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.