Begin typing your search above and press return to search.
మెహర్ ప్రీప్రొడక్షన్ మొదలెట్టేశాడట
By: Tupaki Desk | 8 Aug 2020 9:30 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఈ క్వారంటైన్ టైమ్ ని పక్కాగా సద్వినియోగం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెరీర్ ని వరుస సినిమాలతో పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. రీమేక్ కథలు వినడం స్క్రిప్టులు రెడీ చేయించడం వాటికి దర్శకుల్ని ఫిక్స్ చేయడంలో బిజీ బిజీ.
ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ రీమేక్ లకు మెగా బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో `లూసీఫర్` రీమేక్ కి వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారని ప్రచారమవుతోంది. మోహన్ లాల్ నటించిన లూసీఫర్ మలయాళంలో బంపర్ హిట్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్టును రెడీ చేస్తున్నారు.
ఈ సినిమా గురించి మాటా మంతీ సాగుతుండగానే మరోవైపు అజిత్ `వేదాళం` రీమేక్ లోనూ చిరు నటిస్తారని లీకులందాయి. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు మొదలెట్టేసారని సమాచారం. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న దీని గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. అదే రోజు లూసీఫర్ రీమేక్ కి సంబంధించిన లుక్ ని లాంచ్ చేసే వీలుంది. ప్రస్తుతం కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి తదుపరి రీమేక్ లలో నటిస్తారు.