Begin typing your search above and press return to search.

తోటివారికి సాయం చేయడంలో కూడా మెగాస్టార్ మెగాస్టారే..!

By:  Tupaki Desk   |   7 April 2020 8:30 PM IST
తోటివారికి సాయం చేయడంలో కూడా మెగాస్టార్ మెగాస్టారే..!
X
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప మనసు గురించి ఎన్నో సందర్భాలలో నిరూపితమైంది కూడా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన వంతుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నెలకొల్పి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తాజాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పని లేకుండా పోయిన సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసాడు. ఈ ఛారిటీకి నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ సహా ప్రతి ఒక్క హీరో తమ వంతుగా ఆర్ధిక సాయం అందించారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా వారి ఆకలి తీర్చడానికి ఇప్పటికే వారికి అందించాల్సిన సాయాన్ని మొదలుపెట్టేసారు.

ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాకి చెందిన నాగలక్ష్మి అనే చిరు మహిళా అభిమాని గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమె గుండె ఆపరేషన్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసారట. ఇప్పటికే చిరంజీవి సదరు అభిమానిని హైదరాబాద్‌కు రప్పించే ఏర్పాట్లు చేసారు. ఇక్కడ ఫేమస్ హార్ట్ సర్జన్‌ తో ఆమె గుండె ఆపరేషన్‌కు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రేపు ఆమెకు గుండె ఆపరేషన్ చేసే అవకాశాలున్నాయి. అంతేకాదు హైదరాబాద్‌లో సదరు మహిళ అభిమాని నాగలక్ష్మికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. మొత్తంగా చిరంజీవి తనను ఎంతో అమితంగా ఇష్టపడే అభిమానుల ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ద తీసుకోవడం చూసి అందరు మెగాస్టార్‌ ఔదార్యాన్ని మెచ్చుకుంటున్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సేవాగుణంలో కూడా మెగాస్టార్ మెగాస్టారే అనిపించుకున్నాడు.