Begin typing your search above and press return to search.

పవన్ కి బర్త్ డే విషెష్ తెలిపిన చిరు !

By:  Tupaki Desk   |   2 Sept 2020 11:30 AM IST
పవన్ కి బర్త్ డే విషెష్ తెలిపిన చిరు !
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ ప్రభంజనం. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేయడం మాములే, కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ వ్యక్తి నుంచి ఈ స్థాయికి ఎదిగారు పవన్.. నేడు పవన్ కళ్యాణ్ తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీనితో అభిమానులు సోషల్ మీడియాలో పవన్ కి బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు''. కళ్యాణ్ బాబు Happy Birthday అంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ దాదా జిందాబాద్ లోని ఓ ఫోటోను షేర్ చేశారు. అలాగే , చిత్తూర్ లో పవన్ బర్త్ డే బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసిందని, వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo.. అంటూ చిత్తూర్ లో జరిగిన సంఘటన గురించి ట్వీట్ చేసారు. కాగా, పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి చిత్రబృందం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. సత్యమేవ జయతే అంటూ సాగుతూ.. గాంధీజీ ఫొటోతో ప్రారంభమైన ఈ మోషన్ పోస్టర్‌లో వకీల్ పాత్రలో పవన్ కళ్యాన్ నల్లకోటు, చేతిలో న్యాయ శాస్త్ర పుస్తకం, మరో చేతిలో కర్ర పట్టుకుని కనపడుతున్నాడు. లాయర్ లుక్‌లో పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ కనబడుతూ.. బేస్ బాల్ బాట్ పట్టుకుని అదరగొట్టాడు. ఈ సినిమా హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌గా వస్తోంది