Begin typing your search above and press return to search.

#ఆచార్య‌.. బాసు చిన‌బాసు మాస్ ధ‌మాకా స్పెష‌ల్?

By:  Tupaki Desk   |   11 March 2021 12:30 AM GMT
#ఆచార్య‌.. బాసు చిన‌బాసు మాస్ ధ‌మాకా స్పెష‌ల్?
X
బాసు చిన‌బాసు ఒకే సాంగ్ లో స్టెప్పేస్తే ఎలా ఉంటుందో `బంగారు కోడిపెట్ట..` సాంగ్‌లో చూపించారు. `మ‌గ‌ధీర`‌లో చిన్న బిట్ లో అయినా చెర్రీతో క‌లిసి చిరు స్టెప్పుల‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు బిట్ సాంగ్ కాదు .. ఏకంగా ఫుల్ సాంగ్ నే ప్లాన్ చేస్తున్నార‌ట‌.

మెగాస్టార్ చిరంజీవి- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేష‌న్ మూవీ `ఆచార్య`లో మ‌రోసారి ఆ ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్ లో క‌నిపించ‌డ‌మే కాదు.. ఒకే ఫ్రేమ్ లో అదిరిపోయే మాస్ స్టెప్పుల‌తో దుమ్ము దులిపేస్తార‌ని లీకులు అందాయి. అస‌లే మాస్ డ్యాన్సుల‌తో ఉర్రూత‌లూగించే స్పెష‌లిస్టులు ఆ ఇద్ద‌రూ. అందుకే ఫ్యాన్స్ కి ఇది స్పెష‌ల్ ట్రీట్ అవుతుందంటూ టాక్ స్ప్రెడ్ అవుతోంది.

బాసు చిన‌బాస్ లపై మాస్ డాన్స్ నంబర్ చేయాల‌న్న‌ది కొర‌టాల ప్లాన్. స్తార‌ని స‌మాచారం. నిజానికి ఇప్ప‌టివ‌ర‌కూ ఈ ఐడియా మైండ్ లో లేదు. కానీ ఇది స‌డెన్ థాట్ అని తెలిసింది. ఇటీవ‌ల ఆచార్య‌ టాకీ పార్ట్ పూర్తి చేసిన చ‌ర‌ణ్ మ‌ళ్లీ కొర‌టాల‌కు అందుబాటులోకి వ‌చ్చాక ఈ స్పెష‌ల్ నంబ‌ర్ ని తెర‌కెక్కిస్తార‌ని ఓ స‌మాచారం.

ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ మ‌ళ్లీ ఆచార్య టీమ్ తో జాయిన‌వుతార‌ట‌. ప్ర‌స్తుతం తూ.గో జిల్లాలో ఆచార్య చిత్రీక‌ర‌ణ సాగుతోంది. మే 13 న ఆచార్య విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజ‌ల్-పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ -కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.