Begin typing your search above and press return to search.
సంక్రాంతి పండుగను కలిసి సెలబ్రేట్ చేసుకున్న చిరు - నాగ్..!
By: Tupaki Desk | 15 Jan 2021 2:43 PM ISTటాలీవుడ్ లో మెగా - అక్కినేని ఫ్యామిలీకి మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న నాగ్ - చిరు ఇద్దరూ సన్నిహితులుగా కంటే సోదరభావంతో మెలుగుతుంటారు. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాల్లోనూ పార్టనర్స్ గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ జరుపుకునే వేడుకలలో అక్కినేని నాగార్జున కూడా జాయిన్ అయి వారి మధ్య బంధాన్ని మరోసారి గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సినీ తారలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో మెగా సంక్రాంతి వేడుకల్లో 'కింగ్' నాగ్ అతిథిగా చేరిపోయారు.
మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన సంక్రాంతి సెలబ్రేషన్స్ లో నాగార్జున కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ కచేరితో, రుచికరమైన ఫుడ్ ను ఆరగిస్తూ వీరందరూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవి - నాగార్జునలతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - అల్లు శిరీష్ - వరుణ్ తేజ్ - సాయి తేజ్ కూడా కనిపిస్తున్నారు. అందరూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా మెగా ఫ్యామిలీ హీరోలు - అక్కినేని నాగార్జున కలిసి ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి వారి అభిమానులు ఖుషీ అవుతున్నారు.