Begin typing your search above and press return to search.

షూటింగుల‌కు రెడీ అవుతున్న చిరు- బాల‌య్య‌

By:  Tupaki Desk   |   22 Jun 2021 5:00 PM IST
షూటింగుల‌కు రెడీ అవుతున్న చిరు- బాల‌య్య‌
X
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య‌.. న‌ట‌సింహా నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న అఖండ .. ఇవి రెండూ చిత్రీక‌ర‌ణ‌ల్ని పూర్తి చేసుకునే ద‌శ‌లో ఉన్నాయి. ఆచార్య‌కు 10రోజుల పెండింగ్ చిత్రీక‌ర‌ణ ఉంద‌ని చెబుతున్నారు. అలాగే బాలకృష్ణ అఖండ కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్ తెర‌కెక్కించాల్సి ఉంది.

ప్ర‌స్తుతం చిరు .. బాల‌య్య షూటింగుల‌కు రెడీ అవుతున్నార‌ని సమాచారం. బాల‌య్య‌కు బోయపాటి ఇంతకుముందు సింహా- లెజెండ్ అనే రెండు బ్లాక్ బస్టర్లను అందించారు కాబ‌ట్టి అఖండపై అంచనాలు పెరిగాయి. అఖండ టీజర్ రికార్డు వీక్షణలను పొందింది. అఘోరాగా బాల‌య్య అవ‌తారానికి ప్ర‌శంస‌లు కురిసాయి.

ఇక పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ల్ని పూర్తి చేసేందుకు చిత్ర‌బృందాలు రెడీ అవుతున్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయగా ఆంధ్రప్రదేశ్ లో పాక్షిక లాక్ డౌన్ మాత్రమే అమ‌ల్లో ఉంది. త్వ‌రగా ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చేస్తే... ఇవ‌న్నీ షూటింగులు పూర్త‌యిపోతాయి. అఖండ షూటింగ్ ను హైద‌రాబాద్ లో తిరిగి ప్రారంభించ‌నున్నారు. తదుపరి చివరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు- పోరాట సన్నివేశం తెర‌కెక్కించ‌నున్నారు. సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. మ‌రోవైపు ఆచార్య చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేస్తార‌ని భావిస్తున్నారు.