Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 152 రిలీజ్ 2021లోనేనా?

By:  Tupaki Desk   |   8 Feb 2020 1:30 PM GMT
మెగాస్టార్ 152 రిలీజ్ 2021లోనేనా?
X
పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్ RRR రిలీజ్ వాయిదా ట్విస్ట్ అభిమానులు ఊహించ‌నిది. దీంతో ఫ్యాన్స్ ఇంకా జీర్ణించుకోలేని ప‌రిస్థితి ఉంది. తొలి మీడియా స‌మావేశంలోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. ఆర్.ఆర్.ఆర్ జూలై లో రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌క‌టించి బాహుబ‌లి త‌ర‌హాలోనే ర‌క‌ర‌కాల డైలమాల న‌డుమ వాయిదాని క‌న్ఫామ్ చేశారు. ఇది ఆర్.ఆర్.ఆర్ అభిమానుల కు ఊహించ‌ని షాక్. 2021 జ‌న‌వ‌రి వ‌ర‌కూ ఈ సినిమా కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో రామ్ చ‌ర‌ణ్ .. తార‌క్ అభిమానుల‌కు ట్రీట్ మిస్స‌వ్వ‌డం ఉస్సుర‌నిపించింది. తాజాగా మ‌రో చేదువార్త మెగాభిమానులు వినాల్సిన ప‌రిస్థితి ఉందిట‌.

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 152వ చిత్రం (#ఆచార్య‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆగ‌స్టులో రిలీజ్ అవుతుంద‌ని కుద‌ర‌క‌పోయినా ద‌స‌రాకి అయినా వ‌స్తుంద‌న్న ఊహాగానాలు సాగాయి. అయితే గ‌త కొద్దిరోజులుగా 2021 సంక్రాంతికి మెగాస్టార్ 152 రిలీజ్ అంటూ కొత్త సంగతి ప్ర‌చార‌మైంది. ఇప్పుడు అది కూడా కాదు.. 2021 వేసవిలోనే విడుద‌వుతుంద‌న్న‌ది తాజా అప్ డేట్. ఎట్టి ప‌రిస్థితుల్లో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ త‌ర్వాతే చిరంజీవి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తున్నారట‌. మ‌రి ఈ వాయిదాకి కార‌ణం ఏమిటి అంటే బ‌ల‌మైన రీజ‌నే వినిపిస్తుంది. `ఆచార్య‌`లో రామ్ చ‌ర‌ణ్ 40 నిమిషాల పాత్ర పోషిస్తున్నార‌న్న గుస‌గుస వినిపించింది.

చిరంజీవి యంగ‌ర్ వెర్ష‌న్ రోల్ చ‌ర‌ణ్ చేస్తున్నా డ‌ని...దాదాపు 40 నిమిషాల పాటు ఆ పాత్ర చిరు పెర్ఫామెన్స్ కి ధీటుగా ఉంటుందని కొన్ని లీకులు అందాయి. చ‌ర‌ణ్ పై ఓ పాటను చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ నుంచి అంత బెస్ట్ తీసుకోవాలంటే వ‌చ్చే ఏడాది మాత్రమే ఆ సినిమాకు కాల్షీట్లు కేటాయించ‌గ‌ల‌డ‌ట‌. ప్ర‌స్తుత కాల్షీట్లు అన్నీ ఆర్.ఆర్.ఆర్ సినిమాకే కేటాయించాడుట‌. ఆ సినిమా పూర్త‌యితే కానీ... మెగాస్టార్ `ఆచార్య‌` సంగ‌తి తేల‌డం క‌ష్ట‌మేన‌ట‌. మ‌రి మెగాస్టార్ అప్ప‌టివ‌ర‌కూ వెయిట్ చేస్తారా? కొర‌టాల‌కు అంత ఓపిక ఉందా? అన్న‌ది చూడాల్సి ఉంది. ఇదే నిజ‌మైతే చిరంజీవి తో పాటు.. కొర‌టాల‌కి బోలెడంత స‌మ‌యం వృధా అవుతుంది. ఇప్ప‌టికే చిరు సినిమా కోసం కోర‌టాల ఏడాదిన్న‌ర‌కు పైగా వెయిట్ చేసాడు. మ‌ళ్లీ చ‌ర‌ణ్ కోసం వెయిటింగా అంటే? ఇంకా టైమ్ వేస్ట్. మ‌రి చిరు..కొర‌టాల ద్వ‌యం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. గ‌తంలో స్క్రిప్ట్ కు మ‌రి కాస్త మెరుగులు దిద్దాల్సిందిగా చ‌ర‌ణ్ సూచించ‌డం తో కొర‌టాల మొద‌లు పెట్టిన సినిమానే ఆపేసిన సంగ‌తి తెలిసిందే.