Begin typing your search above and press return to search.
బాలయ్య పిలిచి మరీ అవకాశమిచ్చాడట
By: Tupaki Desk | 14 July 2017 6:28 PM ISTబాలకృష్ణకి ఒక్కసారి నచ్చితే చాలు... ఇక వాళ్లని అంత సులభంగా వదిలిపెట్టరు. వాళ్లలో ప్రతిభని కూడా గమనించాడంటే మళ్లీ మళ్లీ కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. తానే స్వయంగా దర్శకులకి రెకమెండ్ చేస్తూ అవకాశాలు లభించేలా చేస్తుంటారు. అందుకే బాలకృష్ణని ఇష్టపడే సాంకేతిక నిపుణులు - నటీనటులు చాలామంది కనిపిస్తుంటారు. తాజాగా ఆయన తన వందో చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కి 102వ సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశాన్ని ఇప్పించాడట.
బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి చిరంతన్ మంచి సంగీతం ఇచ్చాడు. అది నచ్చే ఆయన్ని తన 102వ చిత్రం కోసం రెకమెండ్ చేశాడట. ఇప్పటికే పాటల పని కూడా మొదలయ్యినట్టు తెలిసింది. బాలయ్య 102వ చిత్రం కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ ప్రొడ్యూస్ చేయనున్న ఆ సినిమా ఆగస్టు మొదటివారంలో మొదలు కానుంది. నయనతార హీరోయిన్‌గా ఎంపికైంది. మరి చిరంతన్ బాలయ్య మాస్ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో, నందమూరి అభిమానుల్ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.