Begin typing your search above and press return to search.

చిరు కూతురు.. బెల్లీ డ్యాన్స్

By:  Tupaki Desk   |   9 Jan 2016 7:36 AM GMT
చిరు కూతురు.. బెల్లీ డ్యాన్స్
X
మెగాస్టార్ అన్నా - మెగా ఫ్యామిలీ అన్నా డ్యాన్సులకు కేరాఫ్ అడ్రస్. చిరంజీవితో మొదలైన ఈ ట్రెండ్ ని రామ్ చరణ్ - అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డ్యాన్సుల్లో కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే.. చిరు కూతురు కూడా డ్యాన్స్ నేర్చుకుంటోందని చెబితే ఎవరైనా నమ్మగలరా ? అయితే చిరంజీవి కూతురు శ్రీజ డ్యాన్స్ నేర్చుకుంటోందన్న మాట వాస్తవమే.

గత కొన్ని ఈ రోజులుగా ఈమె డ్యాన్స్ క్లాసులతో చాలా బిజీగా ఉంది. బెల్లీ డ్యాన్సింగ్ వర్క్ షాప్ లో భాగమయ్యి మరీ ప్రాక్టీసులు చేస్తోంది. ఇండియాస్ గాట్ ట్యాలెంట్ లో లీడ్ కొరియోగ్రాఫర్ అయిన మెహెర్ మాలిక్ దగ్గర.. బెల్లీ డ్యాన్స్ లో స్పెషల్ ట్రిక్స్ తో శిక్షణ పొందుతోంది. ఇందుకోసం ఓ వారం రోజుల స్పెషల్ షెడ్యూల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈమెతో పాటు మరికొందరు డ్యాన్సర్లు కూడా ఈ క్లాసుల్లో భాగ అయ్యారు. అసలు శ్రీజకు డ్యాన్స్ తో పనేంటి అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈమె బేసిక్ గా యాక్టర్ కాదు, అలాగని ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా కాదు. అలాగని అకేషనల్ పెర్ఫామెన్స్ చేసే అలవాటు కూడా లేదు.

పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకుంటోంది అనుకునేందుకు.. లీడ్ కొరిగ్రాఫర్లతో ట్రైనింగ్ అవసరం లేదు. ఒకవేళ తన ట్యాలెంట్ చూపించేందుకు.. నీహారిక స్టైల్ లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఫిక్స్ అయిందా అనుకుంటున్నారు చాలామంది. అయితే.. ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే... నీహారికను ఫ్యాన్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో తేలాల్సి ఉంటుంది.