Begin typing your search above and press return to search.
డాక్టర్ డాటర్స్ తో మెగాస్టార్
By: Tupaki Desk | 5 Jan 2018 8:10 AM GMTగరుడవేగా సినిమా పుణ్యమో లేక అంతకు ముందు కుదిరిన సయోధ్యనో ఖచ్చితంగా చెప్పలేం కాని మెగాస్టార్, రాజశేఖర్ కుటుంబాల మధ్య బాండింగ్ గతంలో కంటే ఇప్పుడు బలంగా మారుతోంది. దానికి నిదర్శనంగా వీలు కుదిరినప్పుడల్లా ఇద్దరు కలుసుకోవడమే అని చెప్పొచ్చు. రాజశేఖర్ కూడా పలు వేదికల్లో, ఇంటర్వ్యూలలో తమ మధ్య ఏదో జరిగిందని, దేని కోసమో రాజీ పడ్డామని రాయకండి అని, తాము మంచి స్నేహితులమని చాలా స్పష్టంగా వివరణ ఇచ్చి మరీ విజ్ఞప్తి చేసాడు. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి కలిసే సందర్భం న్యూ ఇయర్ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి గారు ఇచ్చిన పార్టీలో కుదిరింది. రాజశేఖర్-జీవిత కూతుళ్ళు ఇద్దరు శివాని, శివాత్మిక ఇద్దరు హాజరు కావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మద్య తరచుగా సోషల్ లైఫ్ లోకి వీళ్ళను తీసుకొస్తున్నారు రాజశేఖర్ దంపతులు.
చిరంజీవితో శివాని, శివాత్మిక ఇద్దరు కలిసి ప్రత్యేకంగా ఫోటో దిగటం ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురి డాక్టర్ సీట్ రికమండేషన్ కోసం తాము ఎప్పుడో చిరుని కలిసామని, అప్పటి నుంచే తమ మధ్య అపార్థాలు తొలగిపోయాయని గతంలో రాజశేఖర్ చెప్పారు. ఈ పిక్ చూసాక అది గుర్తు చేసుకుంటున్నరు ఫాన్స్. శివానిని సినిమాల్లో తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. తమిళ్ లో లాంచ్ చేసి ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలి అనేది వాళ్ళ ఆలోచనగా గతంలో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. బహుశా ఈ సంవత్సరమే తెరంగేట్రం ఉండొచ్చు. శివాత్మిక సైతం సినిమాల్లోకే రావాలని ఆసక్తి ఉన్నప్పటికీ ఎలా ఎంట్రీ ఇస్తుంది అనేది ఆ దంపతులకే తెలుసు.